Sunday, October 29, 2017

పోతన రామాయణం - 22

9-299-వ.
ఇట్లు దివ్యరథారూఢుండయి రామచంద్రుండు రావణున కిట్లనియె.
9-300-మ.
"చపలత్వంబున డాఁగి హేమమృగమున్ సంప్రీతిఁ బుత్తెంచుటో
కపటబ్రాహ్మణమూర్తివై యబల నా కాంతారమధ్యంబునం
దపలాపించుటయో మదీయశితదివ్యామోఘబాణాగ్ని సం
తపనం బేగతి నోర్చువాఁడవు? దురంతంబెంతయున్ రావణా!


భావము:
ఈ విధంగా దివ్యరథం ఎక్కిన శ్రీరాముడు రావణునితో ఇలా అన్నాడు. “నాతో యుద్ధం చేయడమంటే చపలత్వంతో చాటునుంచి బంగారులేడిని పంపడం కాదు; బ్రాహ్మణుడిలా దొంగవేషంవేసుకొని ఆడమనిషిని అడవిలో దబాయించడం కాదు. ఓ రావణా! తిరుగులేని, వ్యర్థం కాడం అన్నది లేని నా వాడి బాణాగ్ని తాపం ఎలా ఓర్చుకోగలవో కదా.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: