Friday, August 4, 2017

శ్రీ కృష్ణ జననం - 11

10.1-48-ఆ.
మానవేంద్ర! సత్యమతికి దుష్కరమెయ్య? 
దెఱుఁక గలుగువాని కిష్ట మెయ్య? 
దీశభక్తి రతుని కీరాని దెయ్యది? 
యెఱుక లేనివాని కేది కీడు?
10.1-49-వ.
ఇట్లు సత్యంబు దప్పక కొడుకు నొప్పించిన వసుదేవుని పలుకునిలుకడకు మెచ్చి కంసుం డిట్లనియె.

భావము:
పరీక్షన్మహారాజా! సత్యము నందు నిశ్చలంగా నిలపడిన బుద్దిమంతుడికి కష్టమైన పని అంటూ ఏదీ ఉండదు. జ్ఞాని అయినవాడికి ఇష్టమైనది అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. అజ్ఞానికి అపకారం అంటూ వేరే ఏమీ ఉండదు. పరమేశ్వరుని భక్తుడికి ఇతరులకు ఇవ్వరానిది అంటూ ఏమీ ఉండదు. ఇలా సత్యం తప్పకుండా కొడుకును తీసుకువచ్చి ఒప్పగించిన వసుదేవుని మాటనిలకడకు మెచ్చుకుని కంసుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=48

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: