Saturday, February 18, 2017

కాళియమర్దనము – కట్టా క్రూర భుజంగము

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:
10.1-656-క.
ట్టాక్రూర భుజంగము
ట్టలుకన్ నిన్నుఁ గఱవఁ గంపించితివో?
తిట్టితివో పాపపు విధిఁ?
ట్టీ! మముఁ దలఁచి కాఁక లవించితివో?
10.1-657-క.
న్నగము మమ్ముఁ గఱవక
నిన్నేటికిఁ గఱచెఁ గుఱ్ఱ! నెమ్మి గలిగి నీ
వున్నను మము రక్షింతువు;
ని న్నున్ రక్షింప నేము నేరము తండ్రీ!
టీకా:
కట్టా = అయ్యో; క్రూర = క్రూరమైన; భుజంగము = పాము; కట్ట = గట్టి; అలుకన్ = కోపముతో; నిన్నున్ = నిన్ను; కఱవన్ = కరచుటచేత; కంపించితివో = వణికిపోతివేమో; తిట్టితివో = తిట్టనావేమో; పాపపు = పాపిష్టి; విధిన్ = దైవమును; పట్టీ = అబ్బాయీ; మమున్ = మమ్ము; తలచి = తలచుకొని; కాకన్ = పరితాపముతో; పలవించితివో = విలపించితివో.
పన్నగము = పాము; మమ్మున్ = మమ్మలను; కఱవకన్ = కరవకుండ; నిన్నున్ = నిన్ను; ఏటికిన్ = ఎందుకు; కఱచెన్ = కరిచినది; కుఱ్ఱ = పిల్లవాడ; నెమ్మి = క్షేమము; కలిగి = ఉన్నవాడవు; నీవు = నీవు; ఉన్నను = ఉంటేచాలు; మమున్ = మమ్ములను; రక్షింతువు = కాపాడెదవు; నిన్నున్ = నిన్ను; రక్షింపన్ = కాపాడుటకు; ఏము = మేము; నేరము = శక్తులముకాము; తండ్రీ = అయ్యా.
భావము:
అయ్యయ్యో! క్రూరమైన ఆ పాము కోపంతో నిన్ను కాటువేస్తుంటే భయంతో ఎంత వణికిపోయావో? ఆ పాపిష్ఠి విధిని ఎంతగా తిట్టుకొన్నావో? మమ్మల్ని తలచుకొని బాధతో ఎంతగా పలవరించావో కదా!
ఓ కన్నతండ్రీ! ఈ పాపిష్ఠి పాము మమ్మల్ని కరవకుండ నిన్నెందుకు కరచిందయ్యా? నువ్వు క్షేమంగా ఉంటే మమ్మల్ని రక్షిస్తావు. కాని నువ్వు ఆపదలో ఉంటే మేము నిన్ను రక్షించగల వారము కాదు కదయ్యా!

No comments: