Saturday, October 15, 2016

జగన్మోహిని కథ – వాలుఁగంటి

8-397-ఆ.
వాలుఁగంటి వాఁడి వాలారుఁజూపుల
శూలి ధైర్యమెల్లఁ గోలుపోయి
ఱలి యెఱుకలేక ఱచె గుణంబుల
నాలి మఱచె నిజగణాలి మఱచె.
8-398-వ.
అప్పుడు
8-399-ఆ.
గురవైచి పట్ట నెడలేమి చే దప్పి 
వ్రాలు బంతి గొనఁగ చ్చునెడను
డతి వలువ వీడి డియె మారుతహతిఁ
జంద్రధరుని మనము సంచలింప.

టీకా:
            వాలుగంటి = అందగత్తె; వాడి = నిశితమైన; వాలారు = వగలారెడి; చూపులన్ = చూపులతో; శూలి = శంకరుని; ధైర్యమున్ = నిబ్బరమును; ఎల్ల = అంతను; కోలుపోయి = కోల్పోయి; తఱలి = సంభ్రమించి; ఎఱుక = తెలివి, గురుతు; లేక = లేకుండగ; మఱచెన్ = మరచిపోయి; గుణంబులన్ = స్వగుణములను; ఆలిన్ = భార్యను; మఱచెన్ = మరచిపోయెను; నిజ = తన; గణ = ప్రమథగణముల; అలిన్ = సమూహమును; మఱచెన్ = విస్మరించెను.
            అప్పుడు = అప్పుడు.
            ఎగుర = ఎగుర; వైచి = వేసి; పట్టన్ = పట్టుకొనుటకు; ఎడన్ = వీలు; లేమి = కాకపోవుటచేత; చేన్ = చేయి; తప్పి = జారి; వ్రాలు = పడిపోతున్న; బంతిన్ = బంతిని; కొనంగన్ = తీసుకొనుటకు; వచ్చు = వస్తున్న; ఎడను = సమయమునందు; పడతి = స్త్రీ యొక్క; వలువ = బట్ట; వీడి = విడిపోయి, జారి; పడియెన్ = పడిపోయెను; మారుత = గాలి; హతిన్ = తాకిడికి; చంద్రధరుని = పరమశివుని; మనము = మనస్సు; సంచలింపన్ = చలించిపోగా.

భావము:
          అందమైన ఆ వగలాడి వాడి చూపులకు శివుడు నిగ్రహాన్ని నిబ్బరాన్ని పూర్తిగా కోల్పోయాడు. తన్నుతానే మరచిపోయాడు. అంతే కాదు తన ఇల్లాలినీ, ప్రమథగణాలనూ విస్మరించాడు.
          అలా శంకరుడు మైమరచి ఆమెని చూస్తున్న ఆ సమయంలో . . .
          మోహిని బంతిని ఎగురవేసింది. పట్టుకుందాం అంటే వీలు చిక్కలేదు. దాంతో ఆ బంతి జారి పడిపోయింది. దానిని తీసుకోడానికి వస్తుండగా గాలి తాకిడికి చీర ముడి ఊడిపోయింది. అప్పుడు శివుని మనసు చలించింది.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: