Saturday, September 17, 2016

క్షీరసాగరమథనం – కాలనేమి

8-345-ఆ.
కాలనేమి ఘోర కంఠీరవము నెక్కి
తార్క్ష్యు శిరము శూలధారఁ బొడువ
తని పోటుముట్టు రి గేల నంకించి
దానఁ జావఁ బొడిచె దైత్యవరుని.
8-346-క.
పడి మాలి సుమాలులు
బెరించినఁ దలలుఁ ద్రుంచెఁ బృథు చక్రహతిన్
దఁగొని గరుడుని ఱెక్కలు
చెరించిన మాల్యవంతు శిరమున్ వ్రేసెన్.
8-347-వ.
ఇట్లు పరమపురుషుండగు హరి కరుణాపరత్వంబునం బ్రత్యుపలబ్ద మనస్కులయిన వరుణ వాయు వాసవ ప్రముఖులు పూర్వంబున నెవ్వరెవ్వరితోఁ గయ్యంబు జేయుదురు, వారు వారలం దలపడి నొప్పించి; రయ్యవసరంబున.

టీకా:
          కాలనేమి = కాలనేమి యనువాడు; ఘోర = భీకరమైన; కంఠీరవమున్ = సింహమును; ఎక్కి = ఎక్కి; తార్క్ష్య = గరుడుని; శిరమున్ = తలను; శూలధారన్ = శూలము; ధారన్ = సూదికొనతో; పొడువన్ = పొడవగా; అతనిన్ = అతని యొక్క; పోటుముట్టు = ఆయుధమును; హరి = విష్ణువు; కేలన్ = చేతితో; అంకించి = అందుకొని; దానన్ = దానితోనే; చావన్ = చచ్చేట్టు; పొడిచెన్ = పొడిచెను; దైత్య = రాక్షస; వరుని = ఉత్తముని.
          పదపడి = అటుపిమ్మట; మాలి = మాలి; సుమాలులు = సుమాలి అనువారు; బెదిరించినన్ = భయపెట్టగా; తలలున్ = శిరస్సులను; త్రుంచెన్ = ఖండించెను; పృథు = గొప్పదైన; చక్ర = చక్రపు; హతిన్ = దెబ్బతో; గదన్ = గదను; కొని = తీసుకొని; గరుడుని = గరుత్మంతుని; ఱెక్కలున్ = రెక్కలను; చెదరించిన = చెదరగొట్టిన; మాల్యవంతు = మాల్యవంతుని; శిరమున్ = తలను; వ్రేసెన్ = నరికెను.
          ఇట్లు = ఇలా; పరమపురుషుండు = నారాయణుడు; అగు = అయిన; హరి = విష్ణువు యొక్క; కరుణా = కృపచూపుటయదు; పరత్వంబునన్ = నిష్ఠకలగియుండుటను; ప్రత్యుపలబ్ద = బాగాతెలిసిన; మనస్కులు = మనసులుగలవారు; అయిన = ఐన; వరుణ = వరుణుడు; వాయు = వాయువు; వాసవ = ఇంద్రుడు; ప్రముఖులు = మున్నగుముఖ్యులు; పూర్వంబునన్ = ఇంతకుముందు; ఎవరు = ఎవరైతే; ఎవరి = ఎవరి; తోన్ = తోనైతే; కయ్యంబున్ = పోరు; చేయుదురు = చేయుచున్నారో; వారు = వారు; వారలన్ = వారిని; తలపడి = ఎదుర్కొని; నొప్పించిరి = బాధించిరి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.

భావము:
          అప్పుడు రాక్షస వీరుడు కాలనేమి భీకరమైన సింహాన్ని ఎక్కి వచ్చి, గరుత్మంతుని తలమీద వాడి బల్లెంతో కుమ్మాడు. విష్ణువు అతని ఆ ఆయుధాన్ని పట్టుకుని ఆ రాక్షసుడు చచ్చేలా పొడిచాడు.
          తరువాత విష్ణుని మాలీ, సుమాలీ బెదిరించారు. అంతట నారాయణుడు తన మహా చక్రాయుధంతో వారి తలలు తెగనరికాడు. మాల్యవంతుడు గద పట్టుకుని గరుడుని రెక్కలు చెదరగొట్టాడు. హరి వాని తల కూడా చక్రాయుధంతో ఖండించాడు.  
          ఇలాగ పురుషోత్తముడు శ్రీమహా విష్ణువు కరుణాకటాక్షానికి పాత్రులై తిరిగి బలం పుంజుకున్న వరుణదేవుడూ, వాయుదేవుడూ, దేవేంద్రుడూ మున్నగు దేవతా ప్రముఖులు ఇంతకు ముందు ఎవరు ఎవరితో చేశారో మరల వారు వారిని పోరులో ఎదిరించి పోరాడి పొడిచారు. ఆ సమయంలో . . .

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: