Tuesday, August 30, 2016

క్షీరసాగరమథనం – వేగిర పడకుడీ

8-318-సీ.
వేగిర పడకుడీ వినుఁడు దానవులార! ;
డవు చేయక వత్తు దైత్యులార! 
టు ప్రక్కఁ గూర్చుండుఁ ని కన్ను లల్లార్చి
నుగవ పయ్యెద జాఱఁ దిగిచి
దినె మఱందుల వావులు కల్పించి
ర్మంబు లెడలించి ఱుఁగు జేసి
మెల్లని నగవుల మేనులు మఱపించి
డు జాణ మాటలఁ గాకు పఱచి
8-318.1-ఆ.
సుర వరుల నెల్ల డకించి సురలను
డవు జేయ వలదుద్రావుఁ డనుచు
చ్చు కొలఁది నమృతవారి విభాగించెఁ
రుణి దివిజు లెల్లఁ నిసి పొగడ.
8-319-వ.
అయ్యవసరంబున.

టీకా:
            వేగిర = తొందర; పడకుడీ = పడకండి; వినుడు = వినండి; దానవులారా = దానవులు; తడవు = ఆలస్యము; చేయకన్ = చేయకుండగా; వత్తున్ = వచ్చెదను; దైత్యులారా = దైత్యులు; అటు = ఆ; ప్రక్కన్ = పక్కగా; కూర్చుండుడు = కూర్చొనండి; అని = అని; కన్నులు = కళ్ళని; అల్లల్లార్చి = టపటపాకొట్టుచు; చను = స్తనముల; గవన్ = యుగ్మము; పయ్యెదన్ = పైటను; జాఱన్ = జారిపోవునట్లు; తిగిచి = దిగలాగి; వదినె = వదిన; మఱందుల = మరదులు; వావులున్ = వరుసలు; కల్పించి = కలిపి; మర్మంబులు = కిటుకులు, మర్మస్థానములు; ఎడలించి = వేసి, బయలుచేసి; మఱుగు = మాయ, దాచివేయుట; చేసి = చేసి; మెల్లని = మెత్తని; నగవులన్ = నవ్వులతో; మేనులున్ = మై; మఱపించి = మరపించి; కడు = నెఱ; జాణ = జాణతనపు; మాటలన్ = మాటలతో; కాకుపఱచి = వేడెక్కించి. 
            అసుర = రాక్షస; వరులన్ = శ్రేష్ఠులను; ఎల్లన్ = అందరను; అడగించి = లొంగదీసి; సురలను = దేవతలను; తడవు = ఆలస్యము; చేయన్ = చేయుట; వలదు = వద్దు; త్రావుడు = తాగండి; అనుచున్ = అనుచు; వచ్చుకొలది = వచ్చినంతవరకు; అమృత = అమృతపు; వారిన్ = రసమును; విభాగించెన్ = పంచిపెట్టెను; తరుణి = సుందరి; దివిజులు = దేవతలు; ఎల్లన్ = అందరును; తనిసి = తృప్తిపడి; పొగడన్ = పొగుడుతుండగా.
          ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.

భావము:
            రాక్షసులులారా! తొందర పడకండి, ఆలస్యం చేయకుండా వస్తాను, నెమ్మదిగా కూర్చోండి.” అంటూ పలకరిస్తూ, కన్నులు కదలించింది. రెండు పాలిండ్ల పైనున్న పైటకొంగు జార్చింది. ‘వదిన, మరది’ వరసలు కలిపింది. మర్మస్థానాల మరుగు తొలగించినట్లే తొలగించి మరల కప్పేసింది. చిరునవ్వులతో మైమరపించింది. అద్భుతమైన నెరజాణ మాటలతో రాక్షసులను లొంగదీసుకుంది. దేవతలను “ఆలస్యం చేయకుండా తొందరగా తాగండి” అంటూ అమృతాన్ని దేవతలకు పంచేసింది. దేవతలు సంతృప్తితో అమృతాన్ని ఆరగించి, ఆమెను అభినందించారు.
            అలా మోహినీ అవతారమెత్తి విష్ణువు అమృతం అంతా దేవతలకు పంచిపెట్టు సమయంలో. . .


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: