Wednesday, August 17, 2016

క్షీరసాగరమథనం – చావులేని మందు

8-294-వ.
తదనంతరంబ
8-295-ఆ.
తనిచేత నున్న మృత కుంభము చూచి
కెరలు పొడిచి సురలఁ గికురుపెట్టి
పుచ్చికొనిరి యసుర పుంగవు లెల్లను
మాఱులేని బలిమి మానవేంద్ర!
8-296-వ.
వెండియు.
8-297-ఆ.
చావులేని మందు క్కఁగ మన కబ్బె
నుచుఁ గడవ నసుర లాఁచి కొనిన
వెఱచి సురలు హరికి మొఱలు పెట్టిరి సుధా
పూర్ణఘటము పోయెఁ బోయె ననుచు.

టీకా:
            తదనంతరంబు = తరువాత.
            అతని = అతని యొక్క; చేతన్ = చేతిలో; ఉన్న = ఉన్నట్టి; అమృత = అమృతపు; కుంభమున్ = పాత్రను; చూచి = చూసి; కెరలుపొడిచి = విజృంభించి; సురలున్ = దేవతలను; కికురుపెట్టి = వంచించి; పుచ్చుకొనిరి = తీసుకొనిరి; అసుర = రాక్షసులలో; పుంగవులున్ = శ్రేష్ఠులు; ఎల్లన్ = అందరును; మాఱులేని = తిరుగులేని; బలిమిన్ = బలముతో; మానవేంద్ర = రాజ.
            వెండియు = అటుపిమ్మట.
            చావు = మరణము; లేని = లేని; మందు = ఔషధము; చక్కగ = చక్కగ; మన = మన; కున్ = కు; అబ్బె = లభించెను; అనుచున్ = అనుచు; కడవన్ = పాత్రను; అసురలు = రాక్షసులు; లాచికొనిన = పరుగెట్టగా; వెఱచి = భయపడి; సురలు = దేవతలు; హరి = విష్ణుని; కిన్ = కి; మొఱలుపెట్టిరి = ఆర్తద్వానములుచేసిరి; సుధా = అమృతముతో; పూర్ణ = నిండిన; ఘటమున్ = పాత్ర; పోయెఁబోయెన్ = పొయింది; అనుచు = అనుచు.

భావము:
              అలా ధన్వంతరి అమృత కలశం జనించి వకడలి వెలుపలికి రాగానే. . .
            పరీక్షన్మహారాజా! ధన్వంతరి చేతిలోని అమృతకలశాన్ని రాక్షసులు చూసారు. దేవతలను త్రోసిపుచ్చి, సాటిలేని బలంతో చెలరేగి, ఎగబడి ఆయన చేతులలోని కలశాన్ని లాక్కున్నారు
            అలా అమృతాన్ని అపహరించి . . . .
            “మనకు చావు లేకుండా చేసే మందు సులువుగా దొరికేసింది” అంటూ అమృత భాండాన్ని అపహరించారు. దేవతలు భయంతో “అమృతం నిండా ఉన్నకుండ పోయింది, పోయింది” అంటూ విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: