Sunday, June 5, 2016

క్షీరసాగరమథనం – పాలమున్నీటి

8-175-సీ.
పాలమున్నీటి లోల సర్వతృణలతౌ
ధములు దెప్పించి చాల వైచి
మందరశైలంబు మంథానముగఁ జేసి
నర వాసుకిఁ దరిత్రాడు జేసి
నా సహాయతచేత లి నందఱును మీరు
రువుఁడు వేగ మతంద్రు లగుచు
లము మీఁదయ్యెడుహుళ దుఃఖంబులఁ
డుదురు దైత్యులు పాపమతులు;
8-175.1-ఆ.
లసటేమి లేక ఖిలార్థములుఁగల్గు
విషధిలోన నొక్క విషము పుట్టుఁ
లఁగి వెఱవ వలదు కామరోషంబులు
స్తుచయము నందు లదు చేయ.
టీకా:
            పాలమున్నీటి = పాలసముద్రము; లోపలన్ = అందు; సర్వ = అన్నిరకముల; తృణ = తృణములు {తృణములు - విత్తనమునాటక పండెడి గడ్డి చేమ తాడి కొబ్బరి మున్నగునవి}; లత = తీగలు; ఓషధములున్ = ఓషధులను {ఓషధి - పండుటతోడనే నశించునవి - వరి గోధుమ అరటి మున్నగునవి}; తెప్పించి = తెప్పించి; చాలన్ = విరివిగా; వైచి = వేసి; మందర = మందరము యనెడి; శైలంబున్ = పర్వతమును; మంథానము = కవ్వము; కాన్ = అగునట్లుగ; చేసి = చేసి; తనరన్ = అతిశయించి; వాసుకిన్ = వాసుకియనెడిసర్పమును; త్రాడు = తాడుగా; చేసి = చేసి; నా = నాయొక్క; సహాయత = సహాయము; చేతన్ = వలన; నలిన్ = తగినట్లుగ; అందఱునున్ = అందరుకలిసి; మీరు = మీరు; తరువుడు = చిలకండి; వేగము = వేగముగ; అతంద్రులు = ఎడబాయనివారు; అగుచున్ = అగుచు; ఫలము = ఫలితము; మీది = మీదే; అయ్యెడున్ = అగును; బహుళ = అనేకములైన; దుఃఖంబులన్ = కష్టములను; పడుదురు = చెందెదరు; దైత్యులు = రాక్షసులు {దైత్యులు - దితియొక్క సంతానము, రాక్షసులు}; పాపమతులు = పాపాత్ములు. 
            అలసట = ఆయాసము; ఏమి = ఏమాత్రము; లేక = లేకుండగ; అఖిల = సమస్తమైన; అర్థములన్ = సంపదలు; కల్గున్ = కలుగును; విషధి = సముద్రము {విషధి - విషము (నీటి)కి నిధి, సాగరము}; లోనన్ = అందు; ఒక్క = ఒక; విషము = గరళము; పుట్టున్ = జనించును; కలగి = కలతచెంది; వెఱవన్ = భయపడ; వలదు = వద్దు; కామ = ఇష్టము; రోషంబులు = కినుకలు; వస్తుచయమున్ = సంపదల; అందున్ = ఎడల; వలదు = వద్దు; చేయన్ = చేయుట.
భావము:
            మీరందరూ పాలసముద్రంలో రకరకాల తృణధాన్యాలనూ, ఔషధాలనూ, మొక్కలనూ, తీగలనూ, విరివిగా తెప్పించి వేయండి. మందరపర్వతాన్ని కవ్వంగానూ, సర్పరాజు అయిన వాసుకిని కవ్వం త్రాడుగానూ చేసుకుని నా సహాయంతో పాలసముద్రాన్ని చిలకండి. అందువల్ల, మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపత్ములైన రాక్షసులు అనేక కష్టాల పాలవుతారు. అన్ని సంపదలూ మీకు లభిస్తాయి. ఆ పాలకడలి నుండి ఒక విషం పుడుతుంది. అందుకు మీరు కలతచెంది భయపడరాదు. అలా చిలికేటప్పుడు, ఇంకా అనేక వస్తువులు పుడతాయి. వాటి పట్ల ఇష్టానిష్టాలు చూపరాదు,
८-१७५-सी.
पालमुन्नीटि लोपल सर्वतृणलतौ;
षधमुलु देप्पिंचि चाल वैचि
मंदरशैलंबु मंथानमुगँ जेसि;
तनर वासुकिँ दरित्राडु जेसि
ना सहायतचेत नलि नंदर्रुनु मीरु;
तरुवुँडु वेग मतंद्रु लगुचु;
फलमु मीँदय्येडु; बहुळ दुःखंबुलँ;
बडुदुरु दैत्युलु पापमतुलु;
८-१७५.१-आ.
अलसटेमि लेक यखिलार्थमुलुँगल्गु;
विषधिलेन नोक्क विषमु पुट्टुँ;
गलँगि वेर्रव वलदु कामरोषंबुलु
वस्तुचयमु नंदु वलदु चय.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: