Monday, June 27, 2016

క్షీరసాగరమథనం – అప్పాలవెల్లి

8-209-క.
ప్పాలవెల్లి లోపల
ప్పటికప్పటికి మందరాగము దిరుగం
ప్పుడు నిండె నజాండము
చెప్పెడి దే మజుని చెవులు చిందఱగొనియెన్.
8-210-వ.
అంత నప్పయోరాశి మధ్యంబున.
టీకా:
            ఆ = ఆ; పాలవెల్లి = పాలసముద్రము; లోపలన్ = లోపల; అప్పటికప్పటికి = అప్పటికప్పుడు; మందర = మందరము యనెడి; అగము = కొండ; తిరుగన్ = తిరుగుచున్న; చప్పుడున్ = శబ్దముతో; నిండెన్ = నిండిపోయినది; అజాండము = బ్రహ్మాండము {అజాండము - అజుని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; చెప్పెడిది = చెప్పునది; ఏమి = ఇంక ఏముంది; అజుని = బ్రహ్మదేవుని; చెవులు = చెవులు; చిందఱగొనియెన్ = గింగుర్లెత్తాయి.
            అంతన్ = అంతటఆ = పయోరాశి = సముద్రము {పయోరాశి - పయస్ (నీటి)కి రాశికడలి}; మధ్యంబునన్ = నడుమ.
భావము:
            ఏమని చెప్పేది! పాలసముద్రంలో మందరపర్వతం గిరగిరా తిరుగుతుంటే, దాని శబ్దం బ్రహ్మాండం అంతా నిండిపోయి, బ్రహ్మదేవుడి చెవులు గింగురుమన్నాయి.
            అలా మథిస్తున్నప్పుడు ఆ పాలసముద్రం మధ్యలో. . .
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: