Thursday, June 23, 2016

క్షీరసాగరమథనం – కమఠంబై

8-203-మ.
ఠంబై జలరాశిఁ జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్
దద్రీంద్రము నెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో
రేంద్రాదులు మౌళికంపములతో నౌనౌఁగదే! బాపురే! 
లాక్షా! శరణంచు భూదిశలు నాకాశంబునున్ మ్రోయఁగన్.
టీకా:
            కమఠంబు = తాబేలు {కమఠము - జలమునందు వసించునది, తాబేలు}; ఐ = అయ్యి; జలరాశిన్ = సముద్రమునందు; చొచ్చి = ప్రవేశించి; లఘు = చిన్న; ముక్తా = ముత్యపు; శుక్తి = చిప్ప; చందంబునన్ = వలె; నమతన్ = సుళువుగా; అద్రి = పర్వత; ఇంద్రమున్ = శ్రేష్ఠమును; ఎత్తె = పైకెత్తెను; వాసుకి = వాసుకి యనెడి; మహా = గొప్ప; నాగంబున్ = సర్పము; తోన్ = తోపాటు; లీల = క్రీడించుట; తోన్ = తోటి; అమరేంద్ర = దేవేంద్రుడు; ఆదులు = మొదలగువారు; మౌళి = తలల; కంపముల్ = ఊపుటలు; తోన్ = తో; ఔఔ = మేలుమేలు; కదే = కదా; బాపురే = ఔరా; కమలాక్ష = శ్రీహరి {కమలాక్షుడు - కమలములవంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; శరణు = శరణు; అంచున్ = అని కేకలిడిరి; భూ = భూమండలము; దిశలు = దిక్కులు; ఆకాశంబున్ = ఆకాశము; మ్రోయగన్ = మారుమోగునట్లు.
భావము:
            చిన్న ముత్తంచిప్పంత సుళువుగా, కూర్మరూపధారి అయిన విష్ణువు సముద్రం లోపలకి వెళ్ళాడు.వాసుకి భూరి నాగేంద్రునితో సహా మందర మహాపర్వతాన్ని అవలీలగా పైకెత్తాడు. ఇది చూసి దేవేంద్రుడు మున్నగువారంతా సంతోషంతో తబ్బిబ్బై, తలలు ఊపుతూ భూమండలం నలుదిక్కులా, ఆకాశం అంతా మారుమ్రోగేలా “ఆహా! ఓహో! మేలు మేలు శ్రీహరీ! పద్మాక్షా! శరణం శరణం” అంటూ జయధ్వానాలు చేయసాగారు. . .
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: