Tuesday, June 14, 2016

క్షీరసాగరమథనం – గరుడారోహకుఁడై

8-187-వ.
అని కులకుధర పతనజన్యం బగు దైన్యంబు సహింప నోపక పలవించుచున్న దివిజ దితిజుల భయంబు మనంబున నెఱింగి సకల వ్యాపకుండగు హరి దత్సమీపంబున.
8-188-మ.
రుడారోహకుఁడై గదాదిధరుఁడై కారుణ్యసంయుక్తుఁడై
రికోటిప్రభతో నొహో వెఱవకుం డంచుం బ్రదీపించి త
ద్గిరిఁ గేలన్ నలువొంద గందుకము మాడ్కింబట్టి క్రీడించుచు
న్గరుణాలోకసుధన్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచున్.
టీకా:
            అని = అని; కులకుధర = కులపర్వతముయొక్క; పతన = పడిపోవుటచేత; జన్యంబు = జనించినది; అగు = అయిన; దైన్యంబున్ = దీనత్వమును; సహింపన్ = ఓర్చుకొన; ఓపక = లేక; పలవించుచున్న = పలవరించుచున్న; దివిజ = దేవతల; దితిజుల = రాక్షసుల; భయంబున్ = భయమును; మనంబునన్ = మనసులో; ఎఱింగి = తెలిసి; సకల = సర్వ; వ్యాపకుండు = వ్యాపించెడివాడు; అగు = అయిన; హరి = విష్ణుమూర్తి; తత్ = ఆ; సమీపంబునన్ = దగ్గరలో.
            గరుడ = గరుత్మంతుని; ఆరోహకుడు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; గద = గద; ఆది = మున్నగునవి; ధరుడు = ధరించినవాడు; ఐ = అయ్యి; కారుణ్య = దయతో; సంయుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; హరి = సూర్యులు; కోటి = కోటిమందితోసమానమైన; ప్రభ = ప్రకాశము; తోన్ = తోటి; ఓహో = ఓహో; వెఱవకుండు = భయపడకండి; అంచున్ = అనుచు; ప్రదీపించి = అతిశయించి; తత్ = ఆ; గిరిన్ = కొండను; కేలన్ = చేతితో; నలువొందన్ = నేర్పుతో; కందుకము = బంతి; మాడ్కిన్ = వలె; పట్టి = పట్టుకొని; క్రీడించుచు = ఆడుచూ; కరుణా = కృపా; ఆలోక = దృష్టి యనెడి; సుధన్ = అమృతముతో; సుర = దేవతలు; అసురులన్ = రాక్షసుల; ప్రాణంబుల్ = ప్రాణములను; సమర్థించుచున్ = కాపాడుతూ.
భావము:
            దేవదానవులు ఇలా అనుకుంటూ మంథర పర్వతం పడిపోవటం వలన కలిగిన కష్టాన్ని ఓర్చుకోలేక దుఃఖపడుతున్నారు. వారి భీతిని, ఆపదను తెలుసుకున్న సర్వవ్యాపకుడు అయిన విష్ణువు ఆ ప్రదేశం దగ్గరకి వచ్చాడు.
            దయామయుడై, గదను ధరించి, గరుడవాహనంపై అధిరోహించి వచ్చి, విష్ణుమూర్తి కోటి సూర్యుల కాంతితో వారి ఎదుట ప్రత్యక్షం అయ్యాడు. “ఓ దేవదానవులారా! భయపడకండి” అన్నాడు. మందర పర్వతాన్ని ఎంతో నేర్పుగా చేత్తో పట్టుకుని బంతిలా ఆడిస్తూ, దయామృతం చిలికె చూపులతో వారిని కాపాడాడు.
८-१८७-व.
अनि कुलकुधर पतनजन्यं बगु दैन्यंबु सहिंप नोपक पलविंचुचुन्न दिविज दितिजुल भयंबु मनंबुन नेर्रिंगि सकल व्यापकुंडगु हरि दत्समीपंबुन.
८-१८८-म.
गरुडारोहकुँडै गदादिधरुँडै कारुण्यसंयुक्तुँडै
हरिकोटिप्रभतो नोहो वेर्रवकुं डंचुं ब्रदीपिंचि त
द्गिरिँ गेलन् नलुवोंद गंदुकमु माड्किंबट्टि क्रीडिंचुचु
न्गरुणालकसुधन् सुरासुरुल प्राणंबुल् समर्थिंचुचुन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: