Saturday, May 28, 2016

క్షీరసాగరమథనం – పురుషోత్తమ

8-163-క.
పురుషోత్తమ! నీ రూపము
మశ్రేయంబు భువన పంక్తుల కెల్లన్
స్థివైదిక యోగంబున
రుసను మీ యంద కానచ్చెను మాకున్.
8-164-క.
మొలును నీలోఁ దోఁచెను
దుదియును నటఁ దోఁచె; నడుమ దోఁచెను; నీవే
మొలు నడుమ దుది సృష్టికిఁ
దియఁగ ఘటమునకు మన్ను తి యగు మాడ్కిన్.
టీకా:
            పురుషోత్తమ = నారాయణ {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; నీ = నీ యొక్క; రూపము = స్వరూపము; పరమ = అత్యుత్తమమైన; శ్రేయంబు = శుభప్రదమైనది; భువన = లోకముల; పంక్తుల్ = సమూహముల; కున్ = కు; ఎల్లన్ = సమస్తమునకు; స్థిర = చెదరని; వైదిక = వేదోక్త; యోగంబునన్ = యోగమువలన; వరుసను = క్రమముగ; మీ = మీ; అంద = లోనే; కానవచ్చెను = కనబడెను; మా = మా; కున్ = కు.
            మొదలును = సృష్టికి ఆది; నీ = నీ; లోన్ = అందే; తోచెనున్ = కనబడెను; తుదియునున్ = అంతముకూడ; అటన్ = అక్కడనే; తోచెన్ = కనబడెను; నడుమన్ = రెంటిమధ్యదికూడ; తోచెను = కనబడెను; నీవే = నీవుమాత్రమే; మొదలు = ఆది; నడుమ = మధ్య; తుది = అంతములు; సృష్టి = సృష్టి; కిన్ = కి; కదియంగ = సరిగచూసినచో; ఘటమున్ = కుండ; కున్ = కు; మన్ను = మట్టి; గతి = కారణము; అగు = అయ్యెడి; మాడ్కిన్ = వలె.
భావము:
            ఓ పరమపురుషా! శ్రీమహావిష్ణూ! నీ రూపం సమస్తమైన భువనాలకూ శ్రేయోదాయకం అయినది. ఆ రూపం శాశ్వతమైన వేద మంత్రంతో కూడి మీ యందే మాకు కనబడుచున్నది.
            కుండకు మన్నే ఆధారం, కనుక కారణభూకం. దీనిని ఘటపటన్యాయం అంటారు. అలాగే, ఈ సృష్టికి మొదలూ, మధ్యభాగమూ, అంతమూ నీలోనే ప్రకాశితమవుతున్నాయి. ఈ సృష్టి ఆది, మధ్య, అంతములు అను మూడు దశలకు కారణభూతం నీవే.
            విశేషవివరణ = కుండలు ఎన్ని రకాలైనా ఎన్నైనా అన్ని మట్టియొక్క రూపాలే, మట్టి అంతా ఒక్కటే. అందుచేత కుండకు ఆధారం మట్టి; పటములు అంటే వస్త్రాలు ఎన్ని రకాలైనా ఎన్నైనా అన్ని దారాలయొక్క రూపాలే, దారాలు అన్నీ ఒక్కటే. అందుచేత పటమునకు ఆధారం దారం; ఇలా ఆధారభూతాల గురించి చెప్పే న్యాయం “ఘటపటన్యాయం”.
८-१६३-क.
पुरुषोत्तम! नी रूपमु
परमश्रेयंबु भुवन पंक्तुल केल्लन्
स्थिरवैदिक यगंबुन
वरुसनु मी यंद कानवच्चेनु माकुन्.
८-१६४-क.
मोदलुनु नीलोँ दोँचेनु;
दुदियुनु नटँ दोँचे; नडुम दोँचेनु; नीवे
मोदलु नडुम दुदि सृष्टिकिँ
गदियँग घटमुनकु मन्नु गति यगु माड्किन्.
 : :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: