Monday, May 16, 2016

క్షీరసాగరమథనం - కసిమఁసగి

8-146-క.
సిమఁసగి యసుర విసరము
సి లతికల సురల నెగవ సువులు వెడలం
సఁ జెడిరి; పడిరి; కెడసిరి
మ సమర విలసనముల సమెడలి నృపా!
టీకా:
          కసిమసగి = విజృంభించి; అసుర = రాక్షసుల; విసరములు = సమూహములు; అసి = కత్తుల; లతికలన్ = వరుసలతో; సురలన్ = దేవతలను; ఎగవన్ = మించుతుండ; అసువులు = ప్రాణములు; వెడలన్ = పోవుచుండగ; పస = బలము; చెడిరి = తగ్గినవారై; పడిరి = పడిపోయిరి; కెడసిరి = మరణించిరి; అసమ = సమముకాని; సమర = యుద్ధములు; విలసనములన్ = కలుగుటచేత; అసము = దర్పము; ఎడలి = వికలములై; నృపా = రాజా.
భావము:
          రాజా పరీక్షిత్తూ! రాక్షస మూకలు విజృంభించి ఆయుధాలు ధరించి దేవతలను మించి గట్టి యుద్దాలు చేశారు. దేవతలు బలం తగ్గి, సామర్థ్యాలలో తేడాలు గల ఆ యుద్ధాలలో అనేక ఇక్కట్ల పాలై, ప్రాణాలు అరచేతులలో పెట్టుకుని, శత్రువులను లొంగదీసుకునే ఉపాయం తెలియక తల్లడిల్లిపోయారు.
          పోతనామాత్యులవారు ప్రజాకవి. కసిమసగి వంటి జాతీయాలతో అలరించటంలో వారికి వారే సాటి. వారి భాగవతం జాతి ఛందస్సు అయిన కందపద్యాల కాణాచి. ఇదిగో ఈ సర్వలఘు కందపద్యం లాలిత్యం దానికి ఒక ఋజువు.
8-146-ka.
kasimaM~sagi yasura visaramu
lasi latikala surala negava nasuvulu veDalaM
basaM~ jeDiri; paDiri; keDasiri
yasama samara vilasanamula nasameDali nRipaa!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: