Wednesday, April 13, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట - అమలజ్ఞాన

7-351-మ.
లజ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సర
త్వములన్ యజ్ఞ తపోనసూయలఁ గడున్ ర్పించు ధాత్రీసురో
త్తముకంటెన్ శ్వపచుండు ముఖ్యుఁడు మనోర్థ ప్రాణ వాక్కర్మముల్
తన్ నిన్ను నయించెనేని, నిజ వం శ్రీకరుం డౌఁ దుదిన్.
టీకా:
అమల = స్వచ్ఛమైన; జ్ఞాన = జ్ఞానము; సు = మంచి; దాన = దానములు; ధర్మరతి = నీతి; సత్య = సత్యము; క్షాంతి = ఓర్పు; నిర్మత్సరత్వములన్ = ఈర్ష్యలేకపోవుటలు; యజ్ఞ = యాగములు; తపస్ = తపస్సుచేయుట; అనసూయ = అసూయలేకపోవుట; కడున్ = మిక్కిలి; దర్పించు = గర్వపడెడి; ధాత్రీసురోత్తమున్ = బ్రాహ్మణశ్రేష్ఠుని {ధాత్రీసురోత్తముడు - ధాత్రీసుర (భూమిపైనిదేవతల వంటివాడైన బ్రాహ్మణ) ఉత్తముడు (శ్రేష్ఠుడు)}; కంటెన్ = కంటెను; శ్వపచుండు = నీచజాతివాడు {శ్వపచుడు - కుక్కలను తినువాడు, చండాలుడు}; ముఖ్యుడు = శ్రేష్ఠుడు; మనస్ = మనస్సు; అర్థ = ధనము; ప్రాణ = ప్రాణము, జీవితకాలము; వాక్ = మాట; కర్మముల్ = పనులు ఎడ; సమతన్ = సమత్వముతో; నిన్నున్ = నిన్ను; నయించెనేని = పొందినచో; నిజ = తన; వంశ = కులమునకు; శ్రీకరుడు = వన్నెతెచ్చినవాడు; ఔ = అగును; తుదిన్ = చివరకు.
భావము:
నిర్మల జ్ఞానం, దానం, నీతి, సత్యం, క్షాంతి, ఈర్ష్య లేకపోవుట, యజ్ఞాలు, తపశ్శక్తి, అసూయ లేమి వంటివి ఎన్ని ఉన్నా గర్విష్ఠి అయిన బ్రాహ్మణుని కంటె త్రికరణసుద్ధిగా సమబుద్ధితో నిన్ను సేవించే చండాలుడు ఉత్తముడు. అట్టివాడు నీ సాన్నిధ్యాన్ని పొంది తన వంశం మొత్తానికి శోభ కలిగిస్తాడు.
७-३५१-म.
अमलज्ञान सुदान धर्मरति सत्यक्षांति निर्मत्सर
त्वमुलन् यज्ञ तपोनसूयलँ गडुन् दर्पिंचु धात्रीसुरो
त्तमुकंटेन् श्वपचुंडु मुख्युँडु मनोर्थ प्राण वाक्कर्ममुल्
समतन् निन्नु नयिंचेनेनि, निज वंश श्रीकरुं डौँ दुदिन्.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: