Monday, April 11, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట - అమరుల్


7-349-మ.
రుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి
త్తములన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పా
ము ముట్టన్ నుతిచేయ నోపరఁట; నే క్షస్తనూజుండ గ
ర్వదోద్రిక్తుఁడ బాలుఁడన్ జడమతిన్ ర్ణింప శక్తుండనే?
టీకా:
          అమరుల్ = దేవతలు; సిద్దులు = సిద్ధులు; సంయమి = ముని {సంయమీశ్వరులు - సంయమము (హింసాదులవలన విరమించుట) కలవారు, ముని}; ఈశ్వరులు = శ్రేష్ఠులు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల్ = మొదలగువారు; సతాత్పర్య = ఏకాగ్రతగల; చిత్తములన్ = మనసులతో; నిన్నున్ = నిన్ను; బహు = పలు; ప్రకారములన్ = విధములచే; నిత్యంబున్ = ఎల్లప్పుడు; విచారించి = విచారించినను; పారముముట్టన్ = తుదువరకు; నుతిన్ = స్తుతించుట; చేయన్ = చేయుటకు; ఓపరట = సరిపోరట; నేన్ = నేను; రక్షస్ = రాక్షసుని; తనూజుండన్ = పుత్రుడను {తనూజుండు - తనువున పుట్టినవాడు, కొడుకు}; గర్వ = గర్వము; మద = మదముల; ఉద్రిక్తుడన్ = విజృంభణములుగలవాడను; బాలుడన్ = చిన్నపిల్లవాడను; జడమతిన్ = మూర్ఖుడను; వర్ణింపన్ = కీర్తించుటకు; శక్తుండనే = సమర్థుండనా ఏమి (కాను).
భావము:
            దేవతలూ, సిద్ధులూ, మునీశ్వరులూ, బ్రహ్మదేవుడు మున్నగువారు ప్రగాఢమైన కాంక్షతో నిన్ను నిత్యం అనేక విధాలుగా ఆరాధిస్తారు; నీ గుణాలను గానం చేస్తారు; కాని సంపూర్ణంగా నిన్ను తెలుసుకుని సమగ్రంగా నిన్ను అభివర్ణించలేరట! నేనేమో దానవునికి పుట్టినవాడిని; గర్వ మద స్వభావిని; చిన్నపిల్లాడిని; మూర్ఖుడిని; మరి నిన్ను కీర్తించటం నాకెలా సాధ్యం అవుతుందా?
७-३४९-म.
अमरुल् सिद्धुलु संयमीश्वरुलु ब्रह्मादुल् सतात्पर्य चि
त्तमुलन् निन्नु बहुप्रकारमुल नित्यंबुन् विचारिंचि पा
रमु मुट्टन् नुतिचेय नोपरँट; ने रक्षस्तनूजुंड ग
र्वमदोद्रिक्तुँड बालुँडन् जडमतिन् वर्णिंप शक्तुंडने?
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: