Tuesday, March 1, 2016

నృసింహరూపావిర్భావము – తెంపున బాలుఁ డాడిన

7-287-ఉ.
తెంపున బాలుఁ డాడిన, సుధీరత సర్వగతత్వముం బ్రతి
ష్ఠింపఁ దలంచి యిందు నరసింహశరీరముఁ దాల్చి చక్రి శి
క్షింపఁగ వచ్చినాఁడు; హరిచే మృతి యంచుఁ దలంతు నైన నా
సొంపును బెంపు నందఱును జూడఁ జరింతు హరింతు శత్రువున్."
టీకా:
తెంపున = సాహసముతో; బాలుడు = చిన్నపిల్లవాడు; ఆడిన = పలికిన; సుధీరతన్ = గట్టినమ్మకముతో; సర్వగత = సమస్తమైనభూతాంతర్యామి; తత్వమున్ = అగుటను; ప్రతిష్టింపన్ = స్థాపింపవలెనని; తలంచి = భావించి; ఇందు = దీనిలో; నరసింహ = నరసింహుని; శరీరము = దేహమును; తాల్చి = ధరించి; చక్రి = విష్ణువు {చక్రి - చక్రాయుధముగలవాడు,విష్ణువు}; శిక్షింపగన్ = దండించుటకు; వచ్చినాడు = వచ్చెను; హరి = విష్ణువు; చేన్ = వలన; మృతి = చావు; అంచున్ = అని; తలంతున్ = భావించెదను; ఐనన్ = అయినప్పటికిని; నా = నా యొక్క; సొంపును = అతిశయమును; పెంపును = బలమును; అందఱున్ = అందరును; చూడన్ = చూచునట్లు; చరింతున్ = నడచెదను; హరింతున్ = సంహరించెదను; శత్రువునున్ = శత్రువును.
భావము:
చిన్న పిల్లాడు సాహసంగా పలికిన మాటను నిలబెట్టడానికి, తాను సర్వాత్ముకుడ నని నిరూపించడానికి, విష్ణువు ఇలా నరసింహరూపం ధరించి నన్ను శిక్షించటానికే వచ్చాడు. ఇక శ్రీహరి చేతిలో మరణం తప్పదు. అయినా ఇందరి ముందు నా బలపరాక్రమాలు ప్రదర్శిస్తాను. శత్రుసంహారం చేస్తాను. విజయం సాధిస్తాను.”
७-२८७-उ.
तेंपुन बालुँ डाडिन, सुधीरत सर्वगतत्वमुं ब्रति
ष्ठिंपँ दलंचि यिंदु नरसिंहशरीरमुँ दाल्चि चक्रि शि
क्षिंपँग वच्चिनाँडु; हरिचे मृति यंचुँ दलंतु नैन ना
सोंपुनु बेंपु नंदर्रुनु जूडँ जरिंतु हरिंतु शत्रुवुन्."
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: