Wednesday, February 17, 2016

ప్రహ్లాదుని జన్మంబు - లోకము లన్నియున్

7-267-ఉ.
లోము లన్నియున్ గడియలోన జయించినవాఁడ వింద్రియా
నీముఁ జిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధుఁ జేయు నీ
భీర శత్రు లార్వురఁ బ్రభిన్నులఁ జేయుము ప్రాణికోటిలో
నీకు విరోధి లేఁ డొకఁడు నేర్పునఁ జూడుము దానవేశ్వరా!
టీకా:
లోకముల్ = లోములను; అన్నియున్ = అన్నిటిని; గడియ = కొద్దికాలము; లోనన్ = లోనే; జయించినవాడవు = నెగ్గినాడవు; ఇంద్రియ = ఇంద్రియముల; అనీకము = సమూహము; చిత్తమున్ = మనసు; గెలువన్ = నెగ్గుట; నేరవు = చేయలేవు; నిన్నున్ = నిన్ను; నిబద్దున్ = బంధనములజిక్కుకొన్నవానిగ; చేయున్ = చేయును; నీ = నీ యొక్క; భీకర = భయంకరమైన; శత్రులార్వులన్ = అరిషడ్వర్గములను; ప్రభిన్నులన్ = ఓడినవారినిగా; చేయుము = చేయుము; ప్రాణి = జీవ; కోటి = జాలము; లోన్ = అందు; నీ = నీ; కున్ = కు; విరోధి = శత్రువు; లేడు = లేడు; ఒకడు = మరియొకడు; నేర్పునన్ = వివేకముతో; చూడుము = ఆలోచించుము; దానవేశ్వరా = రాక్షసరాజా.
భావము:
            నువ్వేమో, రాక్షసరాజా! లోకాలు అన్నింటినీ క్షణంలో జయించావు; కానీ నీ లోని మనస్సునూ, ఇంద్రియాలనూ గెలువలేకపోయావు; వాటి ముందు నువ్వు ఓడిపోయావు; కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులు నిన్ను బందీ చేశారు; ఆ భయంకరమైన శత్రువులను అరిషడ్వర్గాలు అంటారు; వాటిని జయించి నశింపజేసావంటే జీవకోటి సర్వంలోనూ నీకు విరోధి ఎవ్వరూ ఉండడు. నా విన్నపం మన్నించు.
७-२६७-उ.
लोकमु लन्नियुन् गडियलोन जयिंचिनवाँड विंद्रिया
नीकमुँ जित्तमुन् गेलुव नेरवु निन्नु निबद्धुँ जेयु नी
भीकर शत्रु लार्वुरँ ब्रभिन्नुलँ जेयुमु प्राणिकोटिलो
नीकु विरोधि लेँ डोकँडु नेर्पुनँ जूडुमु दानवेश्वरा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: