Sunday, November 8, 2015

ప్రహ్లాద చరిత్ర - చదువనివాడజ్ఞుం

7-130-కంద పద్యము
దువనివాఁ డజ్ఞుం డగు
దివిన సదసద్వివేక తురత గలుగుం
దువఁగ వలయును జనులకుఁ
దివించెద నార్యులొద్ధఁ దువుము తండ్రీ!
7-131-వచనము
అని పలికి యసురలోకపురోహితుండును భగవంతుండును నయిన శుక్రాచార్యుకొడుకులఁ బ్రచండవితర్కులఁ జండామార్కుల రావించి సత్కరించి యిట్లనియె.
            ఒకనాడు హిరణ్యాక్షుడు ముద్దుల కొడుకు ప్రహ్లాదుని పిలిచి “బాబూ! చదువుకోని వాడు అజ్ఞానిగా ఉండిపోతాడు. చదువుకుంటే మంచిచెడు తెలుస్తుంది వివేకం కలుగుతుంది. మనిషి అన్నవాడు తప్పకుండ చదువుకోవాలి. కనుక నిన్ను మంచిగురువుల దగ్గర చదివిస్తాను. చక్కగా చదువుకో నాయనా!.” అని చెప్పాడు.
            అని పలికి రాక్షస లోకపు పురోహితుడూ, భగవంతుడూ అయిన శుక్రాచార్యుడి కొడుకులు చండమార్కులను పిలిపించాడు. వారు ప్రచండంగా వితర్కం చేసే నేర్పు కలవారు. వారిని సత్కరించి ఇలా అన్నాడు.
          చదవని = విద్యనేర్వని; వాడు = వాడు; అజ్ఞుండు = జ్ఞానములేనివాడు; అగున్ = అగును; చదివినన్ = విద్యనేర్చినచో; సత్ = మంచి; అసత్ = చెడుల; వివేక = విచక్షణయందు; చతురత = నేర్పు; కలుగున్ = కలుగును; చదువవలయునున్ = విద్యనేర్చితీరవలెను; జనుల్ = ప్రజల; కున్ = కు; చదివించెదన్ = విద్యనేర్పించెదను; ఆర్యులు = జ్ఞానుల; ఒద్దన్ = వద్ద; చదువుము = విద్యలు చదువుకొనుము; తండ్రీ = అయ్యా.
            అని = అని; పలికి = చెప్పి; అసుర = రాక్షసులు; లోక = అందరకును; పురోహితుండును = పురోహితుడు, గురువు; భగవంతుడునున్ = మహిమాన్వితుడు; అయిన = ఐనట్టి; శుక్ర = శుక్రుడు యనెడి; ఆచార్య = గురువు యొక్క; కొడుకులన్ = పుత్రులను; ప్రచండ = తీవ్రమైన; వితర్కులన్ = వాదశాస్త్రమెరిగినవారలను; చండామార్కులన్ = చండామార్కులను; రావించి = పిలిపించి; సత్కరించి = గౌరవించి; ఇట్లు = విధముగ; అనియె = పలికెను.
७-१३०-कंद पद्यमु
चदुवनिवाँ डज्ञुं डगु
जदिविन सदसद्विवेक चतुरत गलुगुं
जदुवँग वलयुनु जनुलकुँ
जदिविंचेद नार्युलोद्धँ जदुवुमु तंड्री!
७-१३१-वचनमु
अनि पलिकि यसुरलोकपुरहितुंडुनु भगवंतुंडुनु नयिन शुक्राचार्युकोडुकुलँ ब्रचंडवितर्कुलँ जंडामार्कुल राविंचि सत्करिंचि यिट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: