Saturday, November 7, 2015

ప్రహ్లాద చరిత్ర - లభ్యం బైన

7-129-శార్దూల విక్రీడితము
భ్యం బైన సురాధిరాజపదమున్ క్షింపఁ డశ్రాంతమున్
భ్యత్వంబున నున్నవాఁ డబలుఁడై జాడ్యంబుతో వీఁడు వి
ద్యాభ్యాసంబునఁ గాని తీవ్రమతి గాఁ డంచున్ విచారించి దై
త్యేభ్యుం డొక్క దినంబునం బ్రియసుతున్ వీక్షించి సోత్కంఠుఁడై.
            “హిరణ్యకశిపుడు తన కొడుకు నడవడి చూసి వీడు దేవేంద్ర పదవి దొరికినా లెక్కచేయడు. ఎప్పుడు చూసినా సోమరిలా అవివేకంతో తిరుగుతున్నాడు. బలహీను అయి జాడ్యంతో చెడిపోవుచున్నాడు. వీడిని చదువులు చదివిస్తే కాని తెలివితేటలు కలవాడు కా డని తలచి, ఒకరోజు కొడుకును చూసి సరదా పడినవాడై.
          లభ్యంబున్ = పొందదగినది; ఐన = అయిన; సురాధిరాజ = దేవేంద్రుని; రాజ = రాజ్య; పదమున్ = అధికారమునుకూడ; లక్షింపడు = లెక్కచేయడు; అశ్రాంతమున్ = ఎల్లప్పుడును; సభ్యత్వంబునన్ = సాధుస్వభావముతో; ఉన్న = ఉన్నట్టి; వాడు = వాడు; అబలుడు = మనోబలములేనివాడు; = అయ్యి; జాడ్యంబు = మందత్వము; తోన్ = తోటి; వీడు = ఇతడు; విద్య = చదువు; అభ్యాసంబునన్ = చెప్పబడుటచే; కాని = కాని; తీవ్ర = చురుకైన; మతి = బుద్ధిగలవాడు; కాడు = అవ్వడు; అంచున్ = అనుచు; విచారించి = భావించి; దైత్యేభ్యుండు = హిరణ్యకశిపుడు {దైత్యేభ్యుడు - దైత్యు (రాక్షసు)లను ఇభ్యుడు (పాలించువాడు), హిరణ్యకశిపుడు}; ఒక్క = ఒక; దినంబునన్ = రోజు; ప్రియసుతున్ = ముద్దులకొడుకును; వీక్షించి = చూసి; సోత్కంఠుడు = ఉత్కంఠగలవాడు; = అయ్యి.
७-१२९-शार्दूल विक्रीडितमु
लभ्यं बैन सुराधिराजपदमुन् लक्षिंपँ डश्रांतमुन्
सभ्यत्वंबुन नुन्नवाँ डबलुँडै जाड्यंबुतो वीँडु वि
द्याभ्यासंबुनँ गानि तीव्रमति गाँ डंचुन् विचारिंचि दै
त्येभ्युं डोक्क दिनंबुनं ब्रियसुतुन् वीक्षिंचि सोत्कंठुँडै.  
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: