Thursday, November 12, 2015

గోవర్ధన పూజ శుభాకాంక్షలు

          కార్తీక మాస శుక్ల పాడ్యమి నాడు గోవర్ధన పూజ. ఇది భాగవత కథకు చెందిన పండుగ. ఈ సందర్భంగా మీ అందరి కుటుంబాలకు శుభాకాంక్షలు. మీ అందరికి మా నల్లనయ్య ధన ధాన్య సమృద్ధి సమకూర్చు గాక. ఈ కథ సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం. గోపకులు చేసే ఇంద్ర యాగం శ్రీకృష్ణుడు మానిపించి, ప్రకృతికి ప్రతీకగా పర్వతాన్ని పూజించ మని నేర్పాడు. తానే గోవర్ధన పర్వతం రూపం దాల్చి, తాను గోవులు గోప గోపికా జనాలతో కలిసి గోవర్ధన గిరికి ప్రదక్షిణ పూజలు చేసాడు.
10.-892-మ.
లాభీరులు వీఁడె కృష్ణుఁ డన నైజంబైన రూపంబుతో
లంకస్థితి నుండి "శైల మిదె మీర్చింప రం" డంచుఁ దా
నొ శైలాకృతిఁదాల్చి గోపకులతో నొండొండఁ బూజించి గో
 దత్తాన్నము లాహరించె విభుఁ డా ప్రత్యక్ష శైలాకృతిన్
          దానితో ఇంద్రుడికి కోపం వచ్చి ఎడతెగని రాళ్ళ వర్షం కురిపించాడు. వరాహ అవతారుడుగా భూమిని ఎత్తిన కృష్ణ భగవానుడు ఒక్క వేలితో గోవర్ధన గిరిని ఎత్తి; గోవులతో సహా గోకులం లోని ఆబాలగోపాలాన్ని కాపాడాడు.  అది కార్తీక మాస శుక్ల చవితి అట.
10.1-915-క.
కిరి యై ధర యెత్తిన హరి
రి సరసిజముకుళ మెత్తుతిఁ ద్రిభువన శం
కరుఁడై గోవర్థన
గిరి నెత్తెం జక్క నొక్క కేలన్ లీలన్.

          అలా ఇంద్రుడికి గర్వభంగం చేయటం, ప్రకృతి శక్తులను గౌరవించుట ద్వారా పర్యావరణం కాపాడుకోవాలి  అని చెప్పడం చేశాడు మా నల్లనయ్య.

No comments: