Sunday, November 22, 2015

ప్రహ్లాద చరిత్ర - పంచశరద్వయస్కుఁడవు

7-151-వచనము
అనిన విని రోషించి రాజసేవకుండైన పురోహితుండు ప్రహ్లాదుం జూచి తిరస్కరించి యిట్లనియె.
7-152-ఉత్పలమాల
పంశరద్వయస్కుఁడవు బాలుఁ డవించుక గాని లేవు భా
షించెదు తర్కవాక్యములు, చెప్పిన శాస్త్రములోని యర్థ మొ
క్కించు యైనఁ జెప్ప వసురేంద్రుని ముందట, మాకు నౌఁదలల్
వంచుకొనంగఁ జేసితివి వైరివిభూషణ! వంశదూషణా!
            ఇలా ప్రహ్లాదుడు చెప్పగా విని అతని గురువు, హిరణ్యకశిప మహారాజు సేవకుడు అయిన ఆ బ్రాహ్మణుడు కోపించి అతనితో ఇలా అన్నాడు.
            “ఓరీ! రాక్షస కులానికి మచ్చ తెచ్చే వాడా! శత్రువులను మెచ్చుకునే వాడా! ప్రహ్లాదా! నిండా అయిదేళ్లు లేవు. చిన్న పిల్లాడివి. ఇంత కూడా లేవు. ఊరికే వాదిస్తున్నావు. మేము కష్టపడి బోధించిన శాస్త్రాలలోని ఒక్క విషయం కూడా చెప్పటం లేదు. రాజుగారి ఎదుట మాకు అవమానము తెస్తావా?
          అనినన్ = అనగా; విని = విని; రోషించి = కోపించి; రాజ = హిరణ్యాక్షుని యొక్క; సేవకుండు = సేవకుడు; ఐన = అయిన; పురోహితుండు = చండామార్కులు; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; చూచి = చూసి; తిరస్కరించి = తెగడి; ఇట్లు = విధముగ; అనియె = పలికెను.
         పంచ = ఐదు (5); శరత్ = సంవత్సరముల; వయస్కుడవు = వయస్సుగలవాడవు; బాలుడవు = పిల్లవాడవు; ఇంచుక = కొంచము; కాని = అయినను; లేవు = లేవు; భాషించెదు = చెప్పుతుంటివి; తర్క = వాదనపూర్వక; వాక్యములున్ = మాటలను; చెప్పిన = నేర్పినట్టి; శాస్త్రము = శాస్త్రము; లోని = అందలి; అర్థమున్ = విషయములను; ఒక్కించుకన్ = బాగాకొంచము; ఐనన్ = అయినను; చెప్పవు = పలుకవు; అసురేంద్రుని = హిరణ్యకశిపుని; ముందటన్ = ఎదురుగ; మా = మా; కున్ = కు; తలల్ = శిరస్సులు; వంచుకొనంగ = వంచుకొనునట్లు; చేసితివి = చేసితివి; వైరిభూషణ = శత్రువులను; భూషణ = అలంకారమైవాడ; వంశ = స్వంత వంశమును; దూషణ = తెగడువాడ.
७-१५१-वचनमु
अनिन विनि रोषिंचि राजसेवकुंडैन पुरोहितुंडु प्रह्लादुं जूचि तिरस्करिंचि यिट्लनिये.
७-१५२-उत्पलमाल
पंचशरद्वयस्कुँडवु बालुँ डविंचुक गानि लेवु भा
षिंचेदु तर्कवाक्यमुलु, चेप्पिन शास्त्रमुलोनि यर्थ मो
क्किंचुक यैनँ जेप्प वसुरेंद्रुनि मुंदट, माकु नौँदलल्
वंचुकोनंगँ जेसितिवि वैरिविभूषण! वंश
दूषणा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: