Friday, October 30, 2015

ప్రహ్లాద చరిత్ర - సద్గుణంబు లెల్ల

7-118-ఆటవెలది
సద్గుణంబు లెల్ల సంఘంబు లై వచ్చి
యసురరాజతనయ నందు నిలిచి
పాసి చనవు విష్ణుఁ బాయని విధమున
నేఁడుఁ దగిలి యుండు నిర్మలాత్మ!
७-११८-आटवेलदि
सद्गुणंबु लेल्ल संघंबु लै वच्चि
यसुरराजतनय नंदु निलिचि
पासि चनवु विष्णुँ बायनि विधमुन

नेँडुँ दगिलि युंडु निर्मलात्म!

సద్గుణంబులు = సుగుణములు; ఎల్లన్ = సర్వమును; సంఘంబులు = గుంపులు కట్టినవి; ఐ = అయ్యి; వచ్చి = వచ్చి; అసురరాజతనయన్ = ప్రహ్లాదుని {అసురరాజతనయడు - అసుర (రాక్షస) రాజ (రాజు యైన హిరణ్యకశిపుని) తనయుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; అందున్ = అందు; నిలిచి = స్థిరపడి; పాసి = వదలి; చనవు = పోవు; విష్ణున్ = విష్ణుమూర్తిని; పాయని = వదలిపోని; విధమునన్ = విధముగ; నేడు = ఇప్పుడు; తగిలి = లగ్నమై; ఉండున్ = ఉండును; నిర్మలాత్మా = శుద్దచిత్తముగలవాడా.

నిర్మలమైన మనసు గల పరీక్షిన్మహారాజా! ఆ రాక్షస రాకుమారుడు ప్రహ్లాదుడు  విష్ణుమూర్తిని ఎప్పటికీ వదలిపెట్టడు. అలాగే సుగుణాలు అన్నీ, ఎప్పటికీ విడిచిపెట్టకుండా, అతనిలో ప్రోగుపడి ఉంటాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=6&Padyam=118.0
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: