Friday, September 18, 2015

కాళియ మర్దన - చూడవదేమి

10.1-658-ఉ.
చూ వదేమి గౌరవపుఁజూపుల మమ్ము; సఖాలితోడ మా
టా వదేమి? మర్మముగ నందెలు పాదములందు మ్రోయ నే
డా వదేమి నర్తనమువ్వల మ్రోలను గోపికావళిం
గూ వదేమి నవ్వులనుగోపకుమారవరేణ్య! చెప్పుమా;
          చూడవు = చూడవు; ఏమి = ఎందుకు; గౌరవపు = గౌరవముతో కూడిన; చూపులన్ = చూపులతో; మమ్మున్ = మమ్ములను; సఖ = స్నేహితుల; ఆలి = సమూహము; తోడన్ = తోటి; మాటాడవు = మాట్లాడుటలేదు; ఏమి = ఎందుకు; మర్మముగన్ = కొంటెగా; అందెలు = కాలిగజ్జెలు; పాదముల = కాళ్ళ; అందున్ = అందు; మ్రోయన్ = మోగుతుండగ; నేడు = ఇవాళ; ఆడవు = ఆడుటలేదు; ఏమి = ఎందులకు; నర్తనముల్ = నాట్యములు; అవ్వల = తల్లుల; మ్రోలను = ఎదురుగా; గోపికా = గోపికా స్త్రీల; అవళిన్ = సమూహములను; కూడవు = కలియవు; అది = అదే; ఏమి = ఎందుకు; నవ్వులను = నవ్వులతో; గోప = గొల్ల; కుమార = పిల్లలలో; వరేణ్య = శ్రేష్ఠుడా; చెప్పుమా = చెప్పుము.
१०.१-६५८-उ. 
चूड वदेमि गौरवपुँजूपुल मम्मु; सखालितड मा
टाड वदेमि? मर्ममुग नंदेलु पादमुलंदु म्रोय ने
डाड वदेमि नर्तनमु? लव्वल म्रोलनु गोपिकावळिं
गूड वदेमि नव्वुलनु? गोपकुमारवरेण्य! चेप्पुमा;
          మన గోకులంలోని బాలలందరిలోకి నీవే శ్రేష్ఠుడవు కదా. ఈరోజు తల్లిదండ్రులను మమ్మల్ని గౌరవంతో కూడిన చూపులతో చూడవేంటయ్యా? మిత్రులతో మాట్లాడవేంటయ్యా? అందగా కాళ్ళ గజ్జలు మోగేలా నాట్యాలు చేయవేమయ్యా? తల్లుల ఎదుట గోపికలతో హాస్యాలాడవేమయ్యా? చెప్పవయ్యా!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: