Thursday, August 20, 2015

బ్రహ్మవరములిచ్చుట - ఏదిక్పాలుర

7-100-శార్దూల విక్రీడితము
దిక్పాలురఁ జూచి నేఁ డలుగునో యే దేవు బంధించునో
యే దిగ్భాగముమీఁద దాడి చనునో యే ప్రాణులం జంపునో
యీ దైత్యేశ్వరుఁ డంచు నొండొరులు దా రింద్రాదు లాస్తాన భూ
వేదిన్ మెల్లన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచు లై.
            ఆ రాక్షసుడి సభలో ఇంద్రాది దిక్పాలకులు ఏ దిక్పాలుని చూసి కోపిస్తాడో, ఏ దేవుడిని చెరబడతాడో,  దాడి చేయడానికి ఎటు పక్కకు వెళ్తాడో, ఇవాళ జీవులు ఎవరికి వీడి చేతిలో మూడుతుందో అని బెదురిపోతూ సందడి కాకుండా గగుర్పాటుతో నిక్కి చూస్తున్నారు.
७-१००-शार्दूल विक्रीडितमु
ए दिक्पालुरँ जूचि नेँ डलुगुनो ये देवु बंधिंचुनो
ये दिग्भागमुमीँद दाडि चनुनो ये प्राणुलं जंपुनो
यी दैत्येश्वरुँ डंचु नोंडोरुलु दा रिंद्रादु लास्तान भू
वेदिन् मेल्लन निक्कि चूतुरु भयाविर्भूत रोमांचु लै.
          ఏ = ; దిక్పాలురన్ = దిక్పాలకులని; చూచి = చూసి; నేడు = ఈ దినమున; అలుగునో = కోపించునో; = ; దేవున్ = దేవుని; బంధించునో = బంధించివేయునో; = ; దిగ్భాగము = దిక్కునగల ప్రదేశముల; మీద = పైన; దాడి = యుద్దమునకు; చనునో = వెళ్ళునో; = ; ప్రాణులన్ = జీవులను; చంపునో = సంహరించునో; = ; దైత్యేశ్వరుడు = రాక్షసరాజు; అంచున్ = అనుచు; ఒండొరుల = ఒక్కొక్కరు; తారు = వారు; ఇంద్రా = ఇంద్రుడు; ఆదులు = మొదలగువారు; అస్థాన = రాజాస్థానపు సభా; భూవేదిన్ = మండపము మీద; మెల్లన = మెల్లగా; నిక్కి = సాగి; చూతురు = చూచెదరు; భయా = భయముచేత; ఆవిర్భూత = కలిగిన; రోమాంచులు = గగుర్పాటుగలవారు; = అయ్యి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: