Tuesday, August 18, 2015

బ్రహ్మవరములిచ్చుట - అట్టళ్ళ

7-96-కంద పద్యము
ట్టళ్ళతోడఁ గోటలఁ
ట్టలుకం గూలఁ ద్రోచి క్రవ్యాదులతోఁ
జుట్టు విడిసి దిక్పాలుర
ట్టణములు గొనియె; నతఁడు లమున నధిపా!
            ధర్మరాజా! హిరణ్యకశిపుడు మితిమీరిన బలంతో, రాక్షసులను వెంటబెట్టుకొని బయలుదేరాడు. దిక్పాలకుల పట్టణాలమీద దాడిచేసాడు. వారి కోటలు, బురుజులు కూలగొట్టి ఆక్రమించుకొన్నాడు.
<అష్ట దిక్పాలకులు>
దిక్కు              : : పాలకుడు      : : పట్టణము
తూర్పు          : : ఇంద్రుడు       : : అమరావతి
ఆగ్నేయము   : : అగ్ని             : : తేజోవతి
దక్షిణము       : : యముడు     : : సంయమని
నైఋతి           : : నిరృతి           : : కృష్ణాంగన
పడమర          : : వరుణుడు     : : శ్రద్ధావతి
వాయవ్యము : : వాయువు     : : గంధవతి
ఉత్తరము        : : కుబేరుడు      : : అలకాపురి

ఈశాన్యము    : : ఈశానుడు     : : కైలాసము
 ७-९६-कंद पद्यमु
अट्टळ्ळतोडँ गोटलँ
गट्टलुकं गूलँ द्रोचि क्रव्यादुलतोँ
जुट्टु विडिसि दिक्पालुर
पट्टणमुलु गोनिये; नतँडु बलमुन नधिपा!
          అట్టళ్ళ = బురుజుల; తోడన్ = తోటి; కోటలన్ = కోటలను; కట్ట = నిండు; అలుకన్ = కోపముతో; కూలద్రోచి = కూలగొట్టి; క్రవ్యాదుల = రాక్షసుల {క్రవ్యాదులు - క్రవ్యము (మాంసము) ఆదులు (భుజించువారు), రాక్షసులు}; తోన్ = తోటి; చుట్టువిడిసి = చుట్టుముట్టి; దిక్పాలుర = దిక్పాలకుల; పట్టణములున్ = పట్టణములను; కొనియెన్ = తీసుకొనెను; అతడు = అతడు; బలమునన్ = శక్తిసామర్థ్యములతో; అధిపా = రాజా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: