Thursday, August 13, 2015

బ్రహ్మవరములిచ్చుట

7-91-వచనము
అని మఱియు రణంబులందుఁ దన కెదురులేని శౌర్యంబును, లోకపాలుర నతిక్రమించు మహిమయును, భువనత్రయజయంబును, హిరణ్యకశిపుండు గోరిన నతని తపంబునకు సంతోషించి దుర్లభం బయిన వరంబు లన్నియు నిచ్చి కరుణించి విరించి యిట్లనియె.
            ఇంకా యుద్ధాలలో తనకి ఎవరూ ఎదురు నిలువ లేని అంతటి శౌర్యం మరియు సమస్త లోకాలను పాలించే వారందరిని ఓడించే చేవ (సమర్థత), భూ, భువః, సువః అనే ముల్లోకాలు మూటి పైన జయం కావాలని హిరణ్యఖశిపుడు వరం కోరాడు. అతని తపస్సుకు సంతోషించి, అట్టి వరాలు దుర్లభాలు అయినా బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు.
७-९१-वचनमु
अनि मर्रियु रणंबुलंदुँ दन केदुरुलनि शौर्यंबुनु, लोकपालुर नतिक्रमिंचु महिमयुनु, भुवनत्रयजयंबुनु, हिरण्यकशिपुंडु गोरिन नतनि तपंबुनकु संतोषिंचि दुर्लभं बयिन वरंबु लन्नियु निच्चि करुणिंचि विरिंचि यिट्लनिये.
          అని = అని; మఱియున్ = ఇంకను; రణంబుల్ = యుద్ధముల; అందున్ = లోను; తన = తన; కున్ = కు; ఎదురు = తిరుగు; లేని = లేని; శౌర్యంబును = శూరత్వమును; లోకపాలురన్ = సర్వలోకముల ప్రభువులను; అతిక్రమించు = ఓడించెడి; మహిమయునున్ = సమర్థతను; భువనత్రయ = ముల్లోకములందు {భువనత్రయము - 1భూలోకము 2స్వర్గలోకము 3పాతాళలోకములు}; జయంబునున్ = విజయములు; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; కోరినన్ = కోరుకొనగ; అతని = అతని; తపంబున్ = తపస్సున; కున్ = కు; సంతోషించి = ఆనందించి; దుర్లభంబు = పొందశక్యముగానివి; అయిన = ఐన; వరంబులు = వరములు; అన్నియున్ = అన్నిటిని; ఇచ్చి = ఇచ్చి; కరుణించి = దయచేసి; విరించి = బ్రహ్మ; ఇట్లు = విధముగ; అనియె = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: