Sunday, July 19, 2015

సుయజ్ఞోపాఖ్యానము - ఎందాఁక

7-54-కంద పద్యము
ఎందాఁక నాత్మ దేహము
నొందెడు నందాఁకఁ గర్మయోగము; లటపైఁ
జెంవు; మాయాయోగ
స్పందితులై రిత్త జాలిఁ డ నేమిటికిన్?
           ఎప్పటి వరకు ఆత్మ దేహంలో ఉంటుందో అప్పటివరకూ కర్మలతో సాంగత్యం సాగుతూనే ఉంటుంది. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టగానే కర్మబంధాలు తెగిపోతాయి. వీటితో సంబంధమే ఉండదు. ఈ మయాయోగానికి చలించిన మనసులతో మీరు కుమిలిపోవడం అనవసరం.

७-५४-कंद पद्यमु
एंदाँक नात्म दॅहमु
नोंदेडु नंदाँकँ गर्मयॉगमु; लटपैँ
जेंदवु; मायायॉग
स्पंदितुलै रित्त जालिँ बड नेमिटिकिन?
            ఎందాకన్ = ఎప్పటివరకు; ఆత్మ = ఆత్మ; దేహమున్ = దేహమును; ఒందెడున్ = చెందియుండునో; అందాక = అప్పటివరకు; కర్మ = కర్మముల; యోగములు = సంబంధములు; అటపైన్ = ఆతరువాత; చెందవు = సంబంధములుండవు; మాయా = మాయతో; యోగ = కలియుటవలన; స్పందితులు = చలించినవారు; = అయ్యి; రిత్తన్ = ఊరకనే; జాలిన్ = దైన్యమునందు; పడన్ = పడిపోవుట; ఏమిటికిన్ = ఎందుకు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: