Wednesday, July 22, 2015

సుయజ్ఞోపాఖ్యానము - మఱియు నానావిధంబు

7-60-వచనము
మఱియు నానావిధంబు లగు శకుంతలంబుల నంతంబు నొందించుచు సకల పక్షి సంహారసంరబ్ధకుం డైన లుబ్ధకుండు దన ముందటఁ గాలచోదితంబై సంచరించుచున్న కుళింగపక్షి మిథునంబు గనుంగొని యందుఁ గుళింగి నురిం దిగిచి యొక్క చిక్కంబులో వైచినం జూచి దుఃఖించి కుళింగపక్షి యిట్లనియె.
          అన్ని రకాల పక్షులనూ వేటాడేవాడు అయిన ఆ బోయ రకరకాల పక్షులను వేటాడుతున్నాడు. కాలం తోసుకొచ్చి అక్కడ సంచరిస్తున్న అడవిపిచ్చుకల జంట వాడి కంటపడింది. ఆడ పిచ్చుకను ఉచ్చుకర్రతో పట్టుకుని చిక్కంలో వేసాడు. అది చూసి మగ పిచ్చుక ఏడుస్తూ ఇలా అంది.
७-६०-वचनमु
मर्रियु नानाविधंबु लगु शकुंतलंबुल नंतंबु नोंदिंचुचु सकल पक्षि संहारसंरब्धकुं डैन लुब्धकुंडु दन मुंदटँ गालचोदितंबै संचरिंचुचुन्न कुळिंगपक्षि मिथुनंबु गनुंगोनि यंदुँ गुळिंगि नुरिं दिगिचि योक्क चिक्कंबुलॉ वैचिनं जूचि दुःखिंचि कुळिंगपक्षि यिट्लनिये.
          మఱియున్ = ఇంకను; నానావిధంబులు = పలురకములవి; అగు = అయిన; శకుంతలంబులన్ = పక్షులను; అంతంబున్ = నాశనము; ఒందించుచున్ = పొందింపజేయుచు; సకల = సమస్తమైన; పక్షి = పిట్టలకు; సంహార = చంపెడి; సంరబ్దకుండు = పూనికగలవాడు; ఐన = అయిన; లుబ్దకుండు = వేటగాడు; తన = తనకు; ముందటన్ = ఎదురుగ; కాల = కాలముచే; చోదితంబు = నడపబడినది; = అయ్యి; సంచరించుచున్న = తిరుగుచున్న; కుళింగ = పిచ్చుక; పక్షి = పిట్టల; మిథునంబున్ = జంటను; కనుంగొని = చూసి; అందున్ = వానిలో; కుళింగిన్ = ఆడుపిచ్చుక; ఉరిన్ = ఉచ్చుతో; తిగిచి = లాగి; ఒక్క = ఒక; చిక్కంబు = సంచి; లో = అందు; వైచినన్ = వేయగా; చూచి = చూసి; దుఃఖించి = దుఃఖించి; కుళింగ = మగపిచ్చుక; పక్షి = పిట్ట; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: