Monday, July 20, 2015

సుయజ్ఞోపాఖ్యానము - వలలురులు

7-57-కంద పద్యము
, లురులు, జిగురుఁ గండెలుఁ,
లిదియు, జిక్కంబు, ధనువు, రములుఁ గొనుచుం
బులుఁగులఁ బట్టెడు వేడుక
లుఁగులు వెడలంగఁ గదలి డవికిఁ జనియెన్.
          పిట్టల వేటగాడైన ఎరుకలవాడు ఉచ్చుకర్ర అనే పక్షులు పట్టుకునే కర్రకు కట్టిన తాళ్ళు, వలలు, జిగురు బంక పూసిన దారపు కండెలు, చద్దెన్నం మూట, చిక్కం అనే జంతువులను వేసుకొనే సంచి, విల్లు అమ్ములు పట్టుకుని పిట్టలను పట్టుకోవాలనే కోరికమీరగా అడవికి బయలుదేరాడు.
७-५७-कंद पद्यमु
वल, लुरुलु, जिगुरुँ गंडेलुँ,
जलिदियु, जिक्कंबु, धनुवु, शरमुलुँ गोनुचुं
बुलुँगुलँ बट्टेडु वॅडुक
यलुँगुलु वेडलंगँ गदलि यडविकिँ जनियेन.
          వలల్ = వలలు; ఉరులు = ఉరితాళ్లు, ఉచ్చుకర్ర; జిగురుగండెలున్ = బంక పూసిన దారపు కండెలు; చలిదియున్ = చద్ది అన్నము మూట; చిక్కంబున్ = సంచి; ధనువు = విల్లు; శరములున్ = బాణములు; కొనుచున్ = తీసుకొని; పులుగులన్ = పక్షులను; పట్టెడు = పట్టుకొనెడి; వేడుకన్ = ఆసక్తి; అలుగులు వెడలంగ = అధికముకాగా; కదలి = బయలుదేరి; అడవి = అడవి; కిన్ = కి; చనియెన్ = వెళ్లెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: