Monday, July 13, 2015

సుయజ్ఞోపాఖ్యానము - ఎవ్వడుసృజించు

7-48-కంద పద్యము
వ్వఁడు సృజించుఁ బ్రాణుల,
నెవ్వఁడు రక్షించుఁ ద్రుంచు నెవ్వఁ డనంతుం
డెవ్వఁడు విభుఁ డెవ్వఁడు వాఁ
డివ్విధమున మనుచుఁ బెనుచు హేలారతుఁడై.
          ఈ విశ్వాన్ని ఎవడైతే సృష్టిస్తాడో, రక్షిస్తాడో, నశింపజేస్తాడో; శాశ్వతుడు ఎవడో; బ్రహ్మాండానికి అధిపతి అయిన వాడు ఎవడో; వాడే లీలావిలాసలతో ఈ లోకాన్ని రక్షిస్తూ, పోషిస్తూ ఉంటాడు.

          నిజానికి సర్వకాల సర్వావస్థలలోనూ తన లీలా విలాసాలతో రక్షించేవాడూ, పోషించేవాడూ ఈ విశ్వానికి సృష్టి స్థితి లయ కారకుడు, అనంతుడు అయిన ఆ ప్రభువే తప్ప మరొకడు ఎవడూ కాదు.   
७-४८-कंद पद्यमु
एव्वँडु सृजिंचुँ ब्राणुल,
नेव्वँडु रक्षिंचुँ द्रुंचु नेव्वँ डनंतुं
डेव्वँडु विभुँ डेव्वँडु वाँ
डिव्विधमुन मनुचुँ बेनुचु हॅलारतुँडै.
          ఎవ్వడు = ఎవడైతే; సృజించున్ = సృష్టించునో; ప్రాణులన్ = జీవులను; ఎవ్వడు = ఎవడైతే; రక్షించున్ = కాపాడునో; త్రుంచున్ = చంపువాడు; ఎవ్వడు = ఎవడో; అనంతుండు = నాశములేనివాడు; ఎవ్వడు = ఎవడో; విభుడు = ప్రభువు; ఎవ్వడు = ఎవడో; వాడు = అతడు; = ; విధమునన్ = విధముగా; మనుచున్ = బ్రతికించును; పెనుచున్ = వృద్ధికలిగించును; హేలా = క్రీడించుటందు; రతుడు = ఆసక్తిగలవాడు; = అయ్యి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: