Sunday, July 12, 2015

సుయజ్ఞోపాఖ్యానము - జననీజనకులఁ

7-47-కంద పద్యము
నీజనకులఁ బాసియు,
వృకముల బాధపడక డుఁ బిన్నలమై
నియెద మెవ్వఁడు గర్భం
బుమును పోషించె వాఁడె పోషకుఁ డడవిన్.
          ఒకవేళ తల్లిదండ్రుల వద్ద నుండి చిన్నప్పుడే తప్పిపోయి, ఘోరమైన అడవిలో పెద్ద తోడేళ్ళ లాంటి క్రూరమృగాలు మధ్య తిరుగుతున్నా భగవంతుని  దయ ఉంటే వాటి బారిని పడి చావకుండా సురక్షితంగా ఉంటాం. తల్లి గర్బంలో ఉన్నప్పుడు రక్షించి పోషించిన వాడు ఆ భగవంతుడే కదా. అలాగే అడవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా, సర్వే సర్వత్రా రక్షకుడు ఆ భగవంతుడే.
७-४७-कंद पद्यमु
जननीजनकुलँ बासियु,
घनवृकमुल बाधपडक कडुँ बिन्नलमै
मनियेद मेव्वँडु गर्भं
बुन मुनु पॉषिंचे वाँडे पॉषकुँ डडविन.
          జననీ జనకుల్ = తల్లిదండ్రుల; కున్ = కు; పాసియు = దూరమై; ఘన = పెద్దపెద్ద; వృకముల = తోడేళ్ళవలన; బాధపడక = బాధలు పొందకుండగ; కడున్ = మిక్కిలి; పిన్నలము = చిన్నవారము; = అయ్యి; మనియెదము = బతికెదము; ఎవ్వడు = ఎవడైతే; గర్భంబునన్ = తల్లి కడుపులో; మున్ను = పూర్వము; పోషించెన్ = పోషించెనో; వాడె = అతడే; పోషకుడు = పోషించువాడు; అడవిన్ = అడవిలో నైనను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: