Tuesday, June 30, 2015

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - భుజశక్తి

7-32-సీస పద్యము
భుజశక్తి నాతోడఁ బోరాడ శంకించి; మున్నీట మునిఁగిన మునుఁగుఁ గాక;
లయించి పెనఁగు నా చలసంభ్రమమున; కెఱఁగి వెన్నిచ్చిన నిచ్చుఁ గాక;
గడంబు సైఁపక సౌకర్యకాంక్షియై; యిల క్రింద నీఁగిన నీఁగుఁ గాక;
క్రోధించి యటుగాక కొంత పౌరుషమున; రి భంగి నడరిన డరు గాక;
7-32.1-ఆటవెలది
ఠినశూలధారఁ గంఠంబు విదళించి, వాని శోణితమున వాఁడి మెఱసి,
త్సహోదరునకు హిఁ దర్పణము జేసి, మెఱసివత్తు మీకు మేలు దెత్తు.
          విష్ణుడు నా బాహుబల పరాక్రమాలు విని భయపడి సముద్రంలో దాగినప్పటికీ, నా శౌర్యసాహసాలు చూసి వెన్నిచ్చి పారిపోయినప్పటికీ, నాతో పోరు ఎందుకులే, బ్రతికి ఉంటే చాలు అనుకుని భయపడిపోయి వరాహంగా భూమిని తవ్వుకుంటూ పాతాళానికి పోయినా సరే, లేదా అలా కాకుండా కోపంతో, పౌరుషంతో నాతో ఎదిరి రణరంగంలో సింహ పరాక్రమం చూపుతూ పోరాటానికి సిద్ధపడినా ఎలాగైనా సరే, ఏమైనా సరే వాడిని మాత్రం ఎప్పటికి వదలి పెట్టను. ఈ వాడి బల్లెంతో వాడి తల తరిగేస్తాను. ఆ వేడి నెత్తురుతో మా తమ్ముడికి తర్పణం వదులుతాను. తప్పక విజయం సాధించి తిరిగి వస్తాను. మీ అందరికి మేలు జేస్తాను.
७-३२-सीस पद्यमु
भुजशक्ति नातॉडँ बॉराड शंकिंचि; मुन्नीट मुनिँगिन मुनुँगुँ गाक;
अलयिंचि पेनँगु ना यचलसंभ्रममुन; केर्रँगि वेन्निच्चिन निच्चुँ गाक;
जगडंबु सैँपक सौकर्यकांक्षियै; यिल क्रिंद नीँगिन नीँगुँ गाक;
क्रॉधिंचि यटुगाक कोंत पौरुषमुन; हरि भंगि नडरिन नडरु गाक;
७-३२.१-आटवेलदि
कठिनशूलधारँ गंठंबु विदळिंचि, वानि शॉणितमुन वाँडि मेर्रसि,
मत्सहॉदरुनकु महिँ दर्पणमु जॅसि, मेर्रसिवत्तु मीकु मॅलु देत्तु.
            భుజ = బాహువుల; శక్తిన్ = బలముతో; నా = నా; తోడన్ = తోటి; పోరాడన్ = యుద్ధముచేయుటకు; శంకించి = జంకి; మున్నీటన్ = సముద్రములో; మునిగినన్ = మునిగినచో; మునుగుగాక = మునుగుగాక (మత్యావతార సూచన); అలయించి = శ్రమించి; పెనగు = పోరెడి; నా = నా యొక్క; అచల = గట్టి; సంభ్రమమున్ = పూనిక; కున్ = కి; ఎఱగి = వంగి; వెన్నిచ్చినన్ = వీపుచూపిన (కూర్మావతార సూచన); ఇచ్చుగాక = చూపుగాక; జగడంబున్ = పోరాటముచేయుటను; సైపక = సహింపలేక; సౌకర్య = సౌఖ్యము, సూకరాకారము; కాంక్షి = కోరువాడు; = అయ్యి; ఇల = భూమి; క్రిందన్ = కింద; ఈగినన్ = దూరినచో; నీగుగాక = దూరుగాక (వరాహవతార సూచన); క్రోధించి = పౌరుషపడి; అటుగాక = అలా కాకుండగ; కొంత = కొంచము; పౌరుషమున = పొరుషముతో; హరి = సింహము; భంగిన్ = వలె; అడరినన్ = అతిశయించిన; అడరుగాక = అతిశయించుగాక.
            కఠిన = కరకు; శూల = శూలముయొక్క; ధారన్ = వాడిదనముచే; కంఠంబున్ = కంఠమును; విదళించి = ఖండించి; వాని = అతని; శోణితమునన్ = రక్తముతో; వాడి = మగటిమ; మెఱసి = చెలరేగి; మత్ = నా యొక్క; సహోదరున్ = సోదరున; కున్ = కు; మహిన్ = భూమిపై; తర్పణముజేసి = తర్పణలువదలి; మెఱసి = అతిశయించి; వత్తున్ = వచ్చెదను; మీ = మీరల; కున్ = కు; మేలున్ = శుభములను; తెత్తున్ = తీసుకొచ్చెదను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: