Friday, June 26, 2015

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - బాలున్

7-27-కంద పద్యము
బాలున్ హరిపదచింతా
శీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధా
జాలున్ సంతోషింపక
యేలా శిక్షించె రాక్షసేంద్రుం డనఘా!
          “పుణ్యాత్ముడా! నారద మహర్షీ! హిరణ్యకశిపుడు దానవ మహారాజు, బాగా మంచి తెలివైనవాడు, సుగుణాల ప్రోగు అయిన తన కొడుకు ప్రహ్లాదుడుని చూసి సంతోషించకుండా ఎందుకు శిక్షించాడు. దానికి అతనికి చేతులు ఎలా వచ్చాయి? పైగా పరమ విష్ణుభక్తుడు కూడా అయిన తన కుమారుణ్ణి బాధించడానికి మనస్సు ఎలా ఒప్పింది?
          అటువంటి కుమారుడు కలిగినందుకు పొంగిపోక ఎందుకు కుంగిపోయాడు? ఎలా శిక్షించగలిగాడు? అని నాకు సందేహంగా ఉంది స్వామీ!
७-२७-कंद पद्यमु
बालुन हरिपदचिंता
शीलुन सुगुणालवालु श्रीमन्मॅधा
जालुन संतॉषिंपक
यॅला शिक्षिंचे राक्षसॅंद्रुं डनघा!
            బాలున్ = పిల్లవానిని; హరి = నారాయణుని; పద = పాదములను; చింతా = స్మరించెడి; శీలున్ = స్వభావము గల వానిని; సుగుణాల = మంచి గుణములకు; వాలున్ = పాదు అయిన వానిని; శ్రీమత్ = శోభాయుక్తమైన; మేధా = బుద్ధి; జాలున్ = విశేషములు కల వానిని; సంతోషింపక = తృప్తుడు గాక; ఏలా = ఎందులకు; శిక్షించెన్ = దండించెను; రాక్షస = రాక్షసులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; అనఘా = పుణ్యుడా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: