Wednesday, June 24, 2015

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - వారించిన

7-23-కంద పద్యము
వారించిన తమకంబున
వారించుక నిలువలేక డిఁ దిట్టిరి దౌ
వారికుల నసురయోని న
వారితులై పుట్టుఁ డనుచు సుధాధీశా!
          భూమండాలాన్ని ఏలే మహారాజా! యుధిష్ఠరా! ఆ సనకసనందాదులు ఎంతో నిగ్రహం కలవారు అయినప్పటికీ, విష్ణుసందర్శనం కోసం తొందరపడుతూ ఉన్నవారు, కనుక అలా ద్వారపాలకులు అడ్డుకోగా సహించలేక, కోపంతో వారిని రాక్షస పుట్టుకలు తప్పక పుట్టెదరు గాక! అని శపించారు.
७-२३-कंद पद्यमु
वारिंचिन तमकंबुन
वारिंचुक निलुवलॅक वडिँ दिट्टिरि दौ
वारिकुल नसुरयॉनि न
वारितुलै पुट्टुँ डनुचु वसुधाधीशा!
            వారించినన్ = అడ్డుకొనగా; తమకంబునన్ = తొందరలో; వారు = వారు; ఇంచుకన్ = కుంచము కూడ; నిలువలేక = సహింపలేక; వడిన్ = వేగముగా; తిట్టరి = శపించిరి; దౌవారికులన్ = ద్వారాపాలకులను; అసుర = రాక్షస {అసురులు - సురులు కానివారు, రాక్షసులు}; యోనిన్ = గర్భమునందు; అవారితులు = అడ్డగింపబడనివారు; = అయ్యి; పుట్టుడు = జన్మించుడు; అనుచున్ = అని; వసుధాధీశా = రాజా {వసుధాధీశుడు - వసుధ (భూమి)కి ఈశుడు (ప్రభువు), రాజు}.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: