Sunday, May 3, 2015

కృష్ణలీలలు

10.1-384-వచనము
ఇట్లు గ్రద్దన నా ముద్దియ ముద్దులపట్టి యుదరంబు గట్టనడరుచుఁ జతురంబుగఁ జక్క నొక్కత్రాడు చుట్టిన నది రెండంగుళంబులు కడమపడియె; మఱియు నొక్క బంధంబు సంధించి వలగొనిన నంతియ కొఱంతయయ్యె; వెండియు నొక్కపాశంబు గూర్చి పరివేష్టించిన వెల్తిఁజూపె; నిట్లు.
10.1-385-కంద పద్యము
జ్జనని లోఁగిటం గల
జ్జుపరంపరలఁ గ్రమ్మఱన్ సుతుఁ గట్టన్
బొజ్జ దిరిగి రా దయ్యె జ
జ్జాలము లున్న బొజ్జఁ ట్టన్ వశమే?
          ఇలా తన ముద్దుల కొడుకును కట్టటానికి ఒక త్రాడు తెచ్చి నడుంచుట్టూ చుట్టబోయింది. అది 2 అంగుళాలు తక్కువైంది. మరోత్రాడు జతచేసినా అదే 2 అంగుళాలు తక్కువైంది. మరొక్క త్రాడు ముడేసినా అంతే తక్కువైంది.
          ఆ యమ్మ ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ వరుసగా కలిపినా అంతే వెలితి ఉండిపోయింది. ముజ్జగములూ దాగి ఉన్న ఆ చిరుబొజ్జను కట్టటం ఎవరి తరం?
10.1-384-vachanamu
iTlu graddana naa muddiya muddulapaTTi yudaraMbu gaTTanaDaruchuM~ jaturaMbugaM~ jakka nokkatraaDu chuTTina nadi reMDaMguLaMbulu kaDamapaDiye; maRriyu nokka baMdhaMbu saMdhiMchi valagonina naMtiya koRraMtayayye; veMDiyu nokkapaashaMbu goorchi parivEShTiMchina veltiM~joope; niTlu.
10.1-385-kaMda padyamu
tajjanani lOM~giTaM gala
rajjuparaMparalaM~ grammaRran sutuM~ gaTTan
bojja dirigi raa dayye ja
gajjaalamu lunna bojjaM~ gaTTan vashamE?
          ఇట్లు = ఈ విధముగ; గ్రద్దనన్ = చటుక్కున; = ప్రసిద్దురాలైన; ముద్దియ = ముద్దరాలు; ముద్దుల = గారాల; పట్టిన్ = పుత్రుని; ఉదరంబున్ = కడుపును; కట్టన్ = కట్టివేయుటకు; అడరుచున్ = పూనుచు; చతురంబుగన్ = నేర్పుగా; చక్కన్ = సరిగా; ఒక్క = ఒకానొక; త్రాడున్ = తాడు; చుట్టినన్ = చుట్టగా; అది = ఆతాడు; రెండు = రెండు (2); అంగుళంబులున్ = అంగుళములు; కడమ = తక్కువ; పడియెన్ = అయ్యెను; మఱియున్ = ఇంకను; ఒక్క = ఒకానొక; బంధంబున్ = తాడు; సంధించి = కలిపి, ముడివేసి; వలగొనినన్ = చట్టుతిప్పగా; అంతియన్ = అంతే; కొఱంత = తక్కువ; అయ్యెన్ = పడినది; వెండియున్ = ఇంకను; ఒక్క = ఒకానొక; పాశంబున్ = తాడు; కూర్చి = ముడివేసి; పరివేష్టించినన్ = చుట్టుతిప్పినను; వెల్తి = తక్కువగుట; చూపెన్ = కనబడెను; ఇట్లు = ఈ విధముగ.
          తత్ = ; జనని = తల్లి; లోగిటన్ = ఇంటిలో; కల = ఉన్నట్టి; రజ్జు = తాళ్ళ; పరంపరలన్ = సమూహములచే; క్రమ్మఱన్ = మరల; సుతున్ = పుత్రుని; కట్టన్ = కట్టబోగా; బొజ్జ = కడుపు; తిరిగి = చుట్టుతిరిగి; రాదు = అందనిది; అయ్యెన్ = అయినది; జగజ్జాలములున్ = ఎల్లలోకములు; ఉన్న = లోనున్న; బొజ్జ = కడుపును; కట్టన్ = కట్టివేయుట; వశమే = శక్యమా, కాదు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: