Wednesday, May 13, 2015

కృష్ణలీలలు

10.1-419-కంద పద్యము
చుంచొదవుఁ బాలు ద్రావు ము
దంచితముగ ననుఁడుఁ బాలు ద్రావి జననితోఁ
జుం చొదవ దనుచు లీలా
చుంచుం డై యతఁడు చుంచుఁ జూపె నరేంద్రా!
          ఓ రాజా పరీక్షిత్తు! “చక్కగా పాలు తాగు జట్టు బాగా పెరుగుతుం” దని చెప్పి పాలు తాగించింది తల్లి యశోదాదేవి. పాలు తాగి చేతితో జుట్టు తడువుకుంటు “జుట్టు పెరగలేదేం టమ్మా” యని అడిగాడు లీలలు చూపు టందు ఆసక్తిగల ఆ బాలకృష్ణమూర్తి.
10.1-419-kaMda padyamu
chuMchodavuM~ baalu draavu mu
daMchitamuga nanuM~DuM~ baalu draavi jananitOM~
juM chodava danuchu leelaa
chuMchuM Dai yataM~Du chuMchuM~ joope narEMdraa!
          చుంచు = పిలక, బలము; ఒదవున్ = బాగగును, కలుగును; పాలున్ = పాలను; త్రావుము = తాగుము; ఉదంచితముగన్ = చక్కగా; అనుడున్ = అనిచెప్పగా; పాలున్ = పాలను; త్రావి = తాగి; జనని = తల్లి; తోన్ = తోటి; చుంచు = జుట్టు, బలము; ఒదవదు = పెరగలేదు; అనుచు = అంటూ; లీలాచుంచుండు = లీలలందు ఆసక్తి కలవాడు; = అయ్యి; అతడు = అతను; చుంచున్ = పిలకను; చూపెన్ = చూపించెను; నరేంద్రా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: