Friday, April 3, 2015

కృష్ణలీలలు

10.1-337-వచనము
అని పలికిన ముగుదతల్లికి నెఱదంట యైన కొడు కిట్లనియె.
10.1-338-శార్దూల విక్రీడితము
మ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
మ్మం జూడకు వీరి మాటలు మదిన్; న్నీవుగొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
మ్మాఘ్రాణము చేసి నా వచనముల్ ప్పైన దండింపవే.
          ఆ ముద్దరాలు అయిన తల్లి యశోదా దేవికి మాయలమారి కృష్ణబాలుడు సమాధానం చెప్తున్నాడు
          అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత వెర్రివాడినా ఏమిటి మట్టి తినడానికి. నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే. వీళ్ళు చెప్పేమాటలు నమ్మెయ్యద్దుఅని చిన్నికృష్ణుడు, మట్టి ఎందుకు తింటున్నావని బెదిరిస్తున్న తల్లి యశోదమ్మకి చెప్పి నోరు తెరిచి చూపించాడు.
10.1-337-vachanamu
ani palikina mugudatalliki neRradaMTa yaina koDu kiTlaniye.
10.1-338-shaardoola vikreeDitamu
ammaa! mannudinaMga nE shishuvunO? yaaM~koMTinO? veRrRrinO?
nammaM jooDaku veeri maaTalu madin; nanneevugoTTaMga vee
rimmaargaMbu ghaTiMchi cheppedaru; kaadEnin madeeyaasya gaM
dhammaaghraaNamu chEsi naa vachanamul tappaina daMDiMpavE.
          అని = అని; పలికిన = చెప్పుతున్న; ముగుద = ముగ్దయైన; తల్లి = తల్లి; కిన్ = కి; నెఱ = మిక్కలి; దంట = దిట్టదనముగలవాడు; ఐన = అయినట్టి; కొడుకున్ = పుత్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
          అమ్మా = తల్లీ; మన్నున్ = మట్టిని; తినంగ = తినుటకు; నేన్ = నేను; శిశువునో = చంటిపిల్లాడినా; ఆకొంటినో = ఆకలేసిఉన్నానా; వెఱ్ఱినో = వెర్రివాడినా; నమ్మంజూడకు = నమ్మబోకుము; వీరి = వీరి యొక్క; మాటలున్ = పలుకులను; మదిన్ = మనసునందు; నన్నున్ = నన్ను; నీవున్ = నీవు; కొట్టంగన్ = కొట్టుటకోసము; వీరు = వీరు; = ఇలాంటి; మార్గమున్ = దారిని; ఘటించి = కూర్చి, కల్పించి; చెప్పెదరు = చెప్పుచున్నారు; కాదేనిన్ = కాకపోయినచో; మదీయ = నా యొక్క; ఆస్య = నోటి; గంధమున్ = వాసనను; ఆఘ్రాణము = వాసనచూచుట; చేసి = చేసి; నా = నా యొక్క; వచనముల్ = మాటలు; తప్పు = అబద్దమైనవి; ఐనన్ = అయినచో; దండింపవే = శిక్షించుము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=40&Padyam=337.0


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: