Friday, April 24, 2015

కృష్ణలీలలు

10.1-370-మత్తేభ విక్రీడితము
స్తభారంబున డస్సి గ్రుస్సి యసదై వ్వాడు మధ్యంబుతో
నితస్వేదముతోఁ జలత్కబరితో స్రస్తోత్తరీయంబుతో
జాతేక్షణ గూడ పాఱి తిరిగెన్ వారించుచున్ వాకిటన్
యోగీంద్రమనంబులున్ వెనుకొనంగాలేని లీలారతున్.
10.1-371-వచనము
ఇట్లు గూడం జని.
            యశోదామాత ఆగు, ఆగు అంటూ ఇంటి ముంగిలిలో పరుగెడుతున్న బాలకృష్ణుడి వెంట పరుగెడుతున్నది.  పెద్ద వక్షోజాల బరువుతో అలసిపోతూ, వంగిపోతూ ఉంది. సన్నని నడుము జవజవలాడుతూ ఉంది. పరుగెట్టే వేగానికి కొప్పు కదిలి జారిపోతూ ఉంది. చమటలు కారిపోతూ ఉన్నాయి. పైట జారిపోతూ ఉంది. మహామహా యోగీంద్రుల మనస్సులు కూడా పట్టుకోలేని ఆ లీలాగోపాల బాలుణ్ణి పట్టాలనే పట్టుదలతో వెంటపడి తరుముతూ ఉన్నది.  ఎంత అదృష్టం యశోదాదేవిది.
            ఇలా శ్రీకృష్ణబాలుడి వెంటపడి
10.1-370-mattEbha vikreeDitamu
stanabhaaraMbuna Dassi grussi yasadai javvaaDu madhyaMbutO
janitasvEdamutOM~ jalatkabaritO srastOttareeyaMbutO
vanajaatEkShaNa gooDa paaRri tirigen vaariMchuchun vaakiTan
ghanayOgeeMdramanaMbulun venukonaMgaalEni leelaaratun.
10.1-371-vachanamu
iTlu gooDaM jani.
          స్తన = స్తనముల; భారమునన్ = బరువు వలన; డస్సి = అలసిపోయి; క్రుస్సి = చిక్కిపోయి; అసదు = సన్ననిది; = అయ్యి; జవ్వాడు = ఊగిపోయెడి; మధ్యంబు = నడుము; తోన్ = తోటి; జనిత = పట్టిన; స్వేదము = చెమట; తోన్ = తోటి; చలత్ = కదిలిపోతున్న; కబరి = జుట్టుముడి; తోన్ = తోటి; స్రస్త = జారిపోయిన; ఉత్తరీయంబు = పైట; తోన్ = తోటి; వనజాతేక్షణ = పద్మాక్షి; కూడ = వెంట; పాఱి = పరుగెట్టి; తిరిగెన్ = వెళ్ళెను; వారించుచున్ = ఆగమనుచు; వాకిటన్ = ఇంటి ముందటి వాకిట్లో; ఘన = గొప్ప; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్టుల; మనంబులున్ = మనసులందు అయినను; వెనుకొనంగాలేని = వెంబడింప జాలని; లీలారతున్ = విహారములు కలవానిని.
           ఇట్లు = ఈ విధముగ; కూడంజని = వెంటబడి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: