Thursday, March 26, 2015

కృష్ణలీలలు

10.1-300-కంద పద్యము
యీడు గోపబాలురు
నుఁ గొలువఁగ రాముఁ గూడి నువు గలుగుచుం
ను గమనంబులఁ గృష్ణుఁడు
నుమధ్యలు మెచ్చ నీల నురుచి మెఱసెన్.
         బాలకృష్ణుడు అన్న బలరామునితో చిన్నచిన్న అడుగులు వేస్తూ ఆడుకుంటు ఉంటే, తన యీడు గల గొల్లపిల్లవాళ్ళు అతని చుట్టూ చేరి ఆడుకునేవారు. అతడే తమ నాయకుడు అన్నట్లు భక్తితో ప్రేమతో ప్రవర్తించేవారు. చల్లని వర్తనలు చూసి మందలోని మగువలు చూసి మెచ్చుకునే అతని నీల దేహకాంతి మెరుస్తున్నది.
10.1-300-kaMda padyamu
tana yeeDu gOpabaaluru
tanuM~ goluvaM~ga raamuM~ gooDi tanuvu galuguchuM
danu gamanaMbulaM~ gRiShNuM~Du
tanumadhyalu mechcha neela tanuruchi meRrasen.
          తన = తన; ఈడు = వయసు; గోప = యాదవ; బాలురు = పిల్లలు; తనున్ = అతనిని; కొలువగన్ = సేవించుచుండగా; రామున్ = బలరాముని; కూడి = తోకలిసి; తనువున్ = మంచి దేహము; కలుగుచున్ = ఉండి; తను = చిన్న; గమనంబులన్ = నడకలతో; కృష్ణుడు = కృష్ణుడు; తనుమధ్యలు = పడతులు {తనుమధ్యలు - సన్నని నడుము కలవారు, స్త్రీలు}; మెచ్చన్ = మెచ్చుకొనునట్లుగా; నీల = నల్లని; తను = శరీరపు; రుచిన్ = రంగుతో; మెఱసెన్ = చక్కగ నుండెను.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: