Saturday, March 21, 2015

కృష్ణలీలలు

10.1-294-కంద పద్యము
వ్వల నెఱుఁగక మువ్వురి
వ్వల వెలుఁగొందు పరముఁ ర్భకుఁడై యా
వ్వలకు సంతసంబుగ
వ్వా! యవ్వా! యనంగ ల్లన నేర్చెన్.
          బ్రహ్మ విష్ణు మహేశ్వరులగు త్రిమూర్తులకు అతీతంగా ప్రకాశించే శ్రీమన్నారాయణుడు జన్మలు లేని వాడు గనుక తనకు అమ్మ అంటు ఎవరు లేరు. జగత్తు అంతటికి తనే అమ్మ. అంతటి పరమపురుషుడు యశోదమ్మ కొడుకై గోపెమ్మలు అందరికి ఆనందం కలిగేలా అమ్మా అమ్మా అనటం నేర్చాడు.
          సర్వకారణమై నిష్కారణమై వెలుగు పరబ్రహ్మము ఆత్మావైపుత్రానామాసీత్ అని శ్రుతి కనుక జగత్తునకు మాతృస్థానమైన తానే పుత్రరూపమై జన్మించి అమ్మా అమ్మా అనసాగాడు. అవ్వ అవ్వ అని వేసిన పంచకంచే మాతృత్వ విలువ చెప్పబడుతోందా? ఆదిపరాశక్తితో అబేధం చెప్పబడుతోందా?
10.1-294-kaMda padyamu
avvala neRruM~gaka muvvuri
kavvala veluM~goMdu paramuM~ DarbhakuM~Dai yaa
yavvalaku saMtasaMbuga
navvaa! yavvaa! yanaMga nallana nErchen.
          అవ్వలన్ = జననులు, ఇతరమైనది; ఎఱుగక = అసలులేకుండ; మువ్వురి = త్రిమూర్తుల {త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు}; కున్ = కు; అవ్వల = అతీతముగ; వెలుగొందు = ప్రకాశించెడి; పరముడు = అతీతమైన భగవంతుడు; అర్భకుడు = పిల్లవాడు; = అయ్యి; = ; అవ్వలు = తల్లుల; కున్ = కు; సంతసంబుగన్ = సంతోషముకలుగునట్లుగ; అవ్వా = అమ్మ; అవ్వా = అమ్మ; అనంగన్ = అనుటను; అల్లనన్ = మెల్లగా; నేర్చెన్ = నేర్చుకొనెను.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: