Saturday, February 28, 2015

కృష్ణలీలలు

10.1-258-వచనము
అప్పుడా బాలుని రోదనంబు విని యశోద పఱతెంచి.
10.1-259-ఆటవెలది
లసితివి గదన్న! యాకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మాను మన్న!
న్నుఁగుడువు మన్న! సంతసపడు మన్న!
నుచుఁ జన్నుఁగుడిపె ర్భకునకు.
          ఇలా శకటాసుర సంహారం చేసిన లీలా బాలకుడు కృష్ణుని ఏడుపు విని యశోద పరుగెట్టుకొచ్చింది.
          ఓనా కన్న తండ్రీ! ఏడ్చి ఏడ్చి అలసిపోయావా. కన్నా ఆకలేస్తోందా! నువ్వు చాలా మంచివాడివి కదరా కన్నా! ఏడుపు మానెయ్యరా కన్నయ్యా! దా పాలు తాగరా కన్నా! ఇక నవ్వరా నాయనా! మరి అంటు లాలిస్తూ యశోద శిశువుకు పాలు ఇచ్చింది.
10.1-258-vachanamu
appuDaa baaluni rOdanaMbu vini yashOda paRrateMchi.
10.1-259-aaTaveladi
alasitivi gadanna! yaakoMTivi gadanna!
maMchi yanna! yEDpu maanu manna!
channuM~guDuvu manna! saMtasapaDu manna!
yanuchuM~ jannuM~guDipe narbhakunaku.
          అప్పుడు = ఆ సమయమునందు; = ; బాలుని = పిల్లవాని; రోదనంబు = ఏడుపు; విని = విని; యశోద = యశోద; పఱతెంచి = పరుగెట్టుకొచ్చి.
          అలసితివి = అలసిపోయావు; కద = కదా; అన్న = నాయనా; ఆకొంటివి = ఆకలి వేసినది; కద = కదా; అన్న = నాయనా; మంచి = బుద్ధిమంతుడివి; అన్న = నాయనా; ఏడ్పున్ = రోదనమును; మానుము = మానివేయుము; అన్న = నాయనా; చన్ను = చనుబాలు; కుడువుము = తాగుము; అన్న = నాయనా; సంతసపడుము = సంతోషింపుము; అన్న = నాయనా; అనుచున్ = అంటూ; చన్నున్ = చనుబాలు; కుడిపెన్ = తాగించెను; అర్భకున్ = పిల్లవాని; కున్ = కి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: