Thursday, February 26, 2015

కృష్ణలీలలు

10.1-254-వచనము
అని వితర్కించు సమయంబున
10.1-255-కంద పద్యము
బాకుఁ డాకొని యేడ్చుచు
గా లెత్తినఁ దాఁకి యెగసెఁ గాని శకట మే
మూమున నెగయ దని త
ద్బాలుని కడ నాడుచుండి లికిరి శిశువుల్.
         బండి ఎలా ఎగిరి పడిందని గోపగోపికలు యోచించుకుంటున్నారు. అప్పుడు.
         అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఇలా చెప్పారు. పక్కమీద పడుకున్న చంటిపిల్లాడు హరి ఆకలేసి ఏడుస్తూ కాలు జాడించాడు. కాలు తగిలి బండి ఎగిరిపడింది. అంతే గాని మరో కారణం కాదు.
10.1-254-vachanamu
ani vitarkiMchu samayaMbuna
10.1-255-kaMda padyamu
baalakuM~ Daakoni yEDchuchu
gaa lettinaM~ daaM~ki yegaseM~ gaani shakaTa mE
moolamuna negaya dani ta
dbaaluni kaDa naaDuchuMDi palikiri shishuvul.
          అని = అని; వితర్కించు = యోచించెడి; సమయంబునన్ = సమయమునందు.
          బాలకుడు = పిల్లవాడు; ఆకొని = ఆకలి వేసి; ఏడ్చుచుచున్ = ఏడుస్తూ; కాలున్ = కాలు; ఎత్తినన్ = ఎత్తగా; తాకి = తగిలి; ఎగసెన్ = ఎగిరినది; కాని = తప్పించి; శకటము = బండి; = మరింకేవిధమైన; మూలమునన్ = కారణముచేతను; ఎగయదు = ఎగరలేదు; అని = అని; తత్ = ; బాలుని = పిల్లవాని; కడన్ = వద్ద; ఆడుచుండి = ఆటలాడుకొనుచు; పలికిరి = చెప్పిరి; శిశువులు = చిన్నపిల్లలు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: