Wednesday, January 21, 2015

రుక్మిణీకల్యాణం - బ్రహ్మచేత-

98- ఆ.
బ్రహ్మచేత భూమితుల కీ ధర్మంబు
ల్పితంబు రాజ్యకాంక్షఁ జేసి
తోడిచూలు నైనఁదోడఁబుట్టినవాఁడు
చంపుచుండుఁ గ్రూర రితుఁ డగుచు.
          రాజ్యకాంక్షతో తోబుట్టువును అయినాసరే, తోడబుట్టిన వాడు క్రూరంగా చంపేస్తాడు. ఇది బ్రహ్మ క్షత్రియులకు కల్పించిన ధర్మం. అంటు బలరాముడు, రుక్మి దీనావస్థకి చింతిస్తున్న రుక్మిణితో చెప్పసాగాడు
98- aa.
brahmachEta bhoomipatula kee dharmaMbu
galpitaMbu raajyakaaMkShaM~ jEsi
tODichoolu nainaM~dODaM~buTTinavaaM~Du
chaMpuchuMDuM~ groora charituM~ Daguchu.
          బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేత = వలన; భూమిపతుల్ = రాజుల; కున్ = కు; = ఇలాంటి; ధర్మంబు = ఆచారము; కల్పితంబు = ఏర్పరచబడినది; రాజ్య = రాజ్యాధికారము నందలి; కాంక్షన్ = గట్టి కోరిక; చేసి = వలన; తోడిచూలున్ = తోడబుట్టినవారిని; ఐనన్ = అయినప్పటికి; తోడబుట్టినవాడు = సోదరుడు; చంపుచున్ = చంపేస్తూ; ఉండున్ = ఉండును; క్రూర = క్రూరమైన; చరితుడు = నడవడికగలవాడు; అగుచున్ = అగుచు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: