Monday, January 5, 2015

రుక్మిణీకల్యాణం – బ్రతుకవచ్చు

80- వ.
అని మఱియును.
81- ఆ.
బ్రతుకవచ్చు నొడలఁ బ్రాణంబు లుండినఁ;
బ్రతుకు గలిగెనేని భార్య గలదు;
బ్రతికి తీవు; భార్యట్టు దైవ మెఱుంగు;
గవ వలదు చైద్య! లదువలదు.
          కష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు అతనిని ఓదారుస్తూ,
ఇంకా ఇలా చెప్పసాగారు నాయనా చేదిరాజ! శశిపాలా! దుఃఖించకు. ఒంట్లో ప్రాణలుంటే ఎలాగైనా బతకొచ్చు. బతికుంటేనే కదా భార్య ఉండేది. పెళ్ళాం మాట దేవుడెరుగు నువ్వు బతికున్నావు. వద్దు. ఇంక అసలు దుఃఖించొద్దు.
80- va.
ani maRriyunu.
81- aa.
bratukavachchu noDalaM~ braaNaMbu luMDinaM~;
bratuku galigenEni bhaarya galadu;
bratiki teevu; bhaaryapaTTu daiva meRruMgu;
vagava valadu chaidya! valaduvaladu.
          అని = అని; మఱియును = ఇంకను.
          బ్రతుకవచ్చు = జీవింపగలము; ఒడలన్ = ఒంట్లో; ప్రాణంబులు = ప్రాణములు; ఉండినన్ = ఉన్నచో; బ్రతుక = జీవించి ఉండుట; కలిగెనేనిన = జరిగినచో; భార్య = భార్య; కలదు = ఎక్కడనైన దొరకును; బ్రతికితివి = జీవించి ఉన్నావు; నీవు = నీవు; భార్యన్ = భార్యను; పట్టు = పట్టుకొనుట; దైవము = దేవునికే; ఎఱుంగు = తెలియునులే; వగవన్ = విచారించుట; వలదు = వద్దు; చైద్య = శిశుపాలుడా; వలదువలదు = వద్దేవద్దు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: