Saturday, January 24, 2015

రుక్మిణీకల్యాణం - అజ్ఞానజ మగు

101- క.
జ్ఞానజ మగు శోకము
విజ్ఞానవిలోకనమున విడువుము నీకుం
బ్రజ్ఞావతికిం దగునే
జ్ఞానుల భంగి వగవ నంభోజముఖీ!
      పద్మం లాంటి ముఖము కలదానా! రుక్మిణీ! అఙ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విఙ్ఞానదృష్టితో విడిచిపెట్టు. నీ లాంటి సుఙ్ఞానికి అఙ్ఞానులలాగ దుఃఖించుట తగదు. అంటు బలరాముడు రుక్మిణిని సముదాయించసాగాడు. – బహు కఠినమైన జ్ఞకార ప్రాసతో, అది అచ్చు కూడ సమానంగా ఉంచి ఇలా అమృత గుళికను అందించిన పోతనగారికి ప్రణామములు.
101- ka.
aGyaanaja magu shOkamu
viGyaanavilOkanamuna viDuvumu neekuM
braGyaavatikiM dagunE
yaGyaanula bhaMgi vagava naMbhOjamukhee!
   అఙ్ఞాన = అఙ్ఞానమువలన; జము = పుట్టునది; అగు = ఐన; శోకము = దుఃఖమును; విఙ్ఞాన = ఆత్మఙ్ఞానము అనెడి; విలోకనమునన్ = దృష్టిచేత; విడువుము = వదలివేయుము; నీ = నీ; కున్ = కు; ప్రఙ్ఞావతి = సమర్థురాలు; కిన్ = కి; తగునే = తగినదా, కాదు; అఙ్ఞానుల = అఙ్ఞానుల; భంగిన్ = వలె; వగవన్ = దుఃఖించుట; అంభోజముఖీ = పద్మాక్షి, రుక్మిణీ.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: