Monday, December 8, 2014

రుక్మిణీకల్యాణం – ఆలోపల

46- క.
లోపల నేకతమున
నాలోలవిశాలనయన గు రుక్మిణి ద
న్నా లోకలోచనుఁడు హరి
యాలోకము చేసి కదియఁ ని శంకితయై.
          ఇంతట్లో చలించుచున్న్ పెద్ద పెద్ద కళ్ళున్న ఆ రుక్మిణీదేవి తనలోతాను తన ఏకాంతమందిరంలో సూర్యచంద్రులు కన్నులుగా ఉండుట వల్ల లోకాలకు చూసే శక్తిని ఇచ్చేవాడైన కృష్ణుడు ఏకారణంచేతనైనా తన మీద దృష్టిపెట్టి తనను చేర రాడేమో నని బెంగపెట్టుకుంది.
46- ka.
aalOpala nEkatamuna
naalOlavishaalanayanayagu rukmiNi da
nnaa lOkalOchanuM~Du hari
yaalOkamu chEsi kadiyaM~ Dani shaMkitayai.
          ఆలోపలన్ = ఆ సమయమునందు; ఏకతమునన్ = ఏకాంతముగ; ఆలోల = చలించెడి; విశాల = పెద్దపెద్ద; నయన = కనులుగలామె; అగు = ఐన; రుక్మిణి = రుక్మిణీదేవి {రుక్మిణి - రుక్మము (బంగారము) కలిగినామె}; తన్నున్ = ఆమెను; = ఆ ప్రసిద్ధుడైన; లోకలోచనుడు = కృష్ణుడు {లోకలోచనుడు - లోకప్రకాశకులైన సూర్య చంద్రులు కన్నులుగా కలవాడు, లోకములకు కన్నుల వంటివాడు, విష్ణువు}; హరి = కృష్ణుడు; ఆలోకము = చూసి; కదియడు = సమీపించడు; అని = అని; శంకిత = సంశయము కలది; = అయ్యి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: