Wednesday, December 24, 2014

రుక్మిణీకల్యాణం - వారలుత్సహించి

66- వ.
అని గౌరీదేవికి మ్రొక్కి పతులతోడం గూడిన బ్రాహ్మణ భార్యలకు లవ ణాపూపంబులును, తాంబూల కంఠసూత్రంబులును, ఫలంబులు నిక్షు దండంబులు నిచ్చి రుక్మిణీదేవి వారలం బూజించిన.
67- ఆ.
వార లుత్సహించి లనొప్ప దీవించి
సేస లిడిరి యువతి శిరమునందు;
సేస లెల్లఁ దాల్చి శివవల్లభకు మ్రొక్కి
మౌననియతి మాని గువ వెడలె.
          రుక్మిణిదేవి దుర్గమ్మకు అలా మొక్కింది. బ్రాహ్మణ దంపతులకు ఉప్పు, అప్పాలు, తాంబూలాలు, మెడలో వేసుకొనే తాళ్ళు, పళ్ళు, చెరకు గడలు దానం చేసి పూజించింది.
          వారు ఉత్సాహంతో చక్కగా దీవించి, ఆమె తల మీద అక్షతలు వేసారు. రుక్మణి ఆ ఆశీర్వచనాలు ధరించి పార్వతీదేవికి నమస్కారాలు పెట్టింది. మౌనవ్రతం వదలి బయట కొచ్చింది.
66- va.
ani gaureedEviki mrokki patulatODaM gooDina braahmaNa bhaaryalaku lava NaapoopaMbulunu, taaMboola kaMThasootraMbulunu, phalaMbulu nikShu daMDaMbulu nichchi rukmiNeedEvi vaaralaM boojiMchina.
67- aa.
vaara lutsahiMchi valanoppa deeviMchi
sEsa liDiri yuvati shiramunaMdu;
sEsa lellaM~ daalchi shivavallabhaku mrokki
maunaniyati maani maguva veDale.
          అని = అని; గౌరీదేవి = పార్వతీదేవి; కిన్ = కి; మ్రొక్కి = నమస్కరించి; పతుల = భర్తల; తోడన్ = తోటి; కూడిన = కలసి ఉన్న; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; భార్యలు = గృహిణుల; కున్ = కు; లవణ = ఉప్పు; ఆపూపంబులున్ = అప్పములను; తాంబూల = తాంబూలములు {తాంబూలము తమలపాకులు, సున్నం, వక్కలు ఆదులు కూడినది}; కంఠసూత్రంబులును = మెడనూళ్ళు; ఫలంబులున్ = పండ్లు; ఇక్షు = చెరకు; దండంబులున్ = గెడలు; ఇచ్చి = ఇచ్చి; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; వారలన్ = వారిని; పూజించినన్ = ఆర్చించగా.
          వారలు = వారు; ఉత్సహించి = సంతోషించి; వలనొప్పన్ = బహుచక్కగా; దీవించి = ఆశీర్వదించి; సేసలు = అక్షింతలు; ఇడిరి = వేసిరి; యువతి = బాల; శిరమున్ = తల; అందున్ = మీద; సేసలు = అక్షింతలు; ఎల్లన్ = అన్నిటిని; తాల్చి = ధరించి; శివవల్లభ = పార్వతీదేవి {శివవల్లభ - శివునిభార్య, పార్వతి}; కున్ = కి; మ్రొక్కి = నమస్కరించి; మౌననియతిన్ = మౌనవ్రతమును; మాని = విడిచిపెట్టి; మగువ = యువతి; వెడలెన్ = బయలుదేరెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: