Sunday, December 21, 2014

రుక్మిణీకల్యాణం – సన్నద్ధులై

63- సీ.
న్నద్ధులై బహు స్త్ర సమేతులై
          లిసి చుట్టును వీరటులు గొలువ
ముందఱ నుపహారములు కానుకలు గొంచు
          ర్గంబులై వారనిత లేఁగఁ
బుష్ప గంధాంబర భూషణ కలితలై
          పాడుచు భూసురభార్య లరుగఁ
 ణవ మర్దళ శంఖ టహ కాహళ వేణు
          భేరీధ్వనుల మిన్ను పిక్కటిలఁగఁ
ఆ.
గిలి సఖులు గొల్వఁ ల్లులు బాంధవ
తులు దోడ రాఁగ వినయముగ
గరు వెడలి నడచె గజాతకును మ్రొక్క
బాల చికురపిహితఫాల యగుచు.
          అప్పుడు, రుక్మిణి గౌరీ పూజ చేయడానికి నగరం బయటకి బయలు దేరింది. ఆమె నుదిటి మీద ముంగురులు ఆవరించాయి. సర్వాయుధాలతో సర్వసన్నధంగా ఉన్న శూరులు చుట్టు కొలుస్తున్నారు. వారవనితలు ఫలహారాలు కానుకలు పట్టుకొని వరసలు కట్టి ముందర నడుస్తున్నారు. సర్వాలంకార శోభిత లైన విప్రుల భార్యలు పాటలు పాడుతు వస్తున్నారు. మద్దెలలు, తప్పెట్లు, శంఖాలు, బాకాలు, వేణువులు, భేరీలు మొదలైన మంగళ వాయిద్యాల చప్పుళ్ళు మిన్నంటుతున్నయి. చెలికత్తెలు చేరి కొలుస్తున్నారు. తల్లులు, బంధువులు, అంతఃపుర స్త్రీలు కూడా వస్తున్నారు.
63- see.
sannaddhulai bahu shastra samEtulai
          balisi chuTTunu veerabhaTulu goluva
muMdaRra nupahaaramulu kaanukalu goMchu
          vargaMbulai vaaravanita lEM~gaM~
buShpa gaMdhaaMbara bhooShaNa kalitalai
          paaDuchu bhoosurabhaarya larugaM~
 baNava mardaLa shaMkha paTaha kaahaLa vENu
          bhEreedhvanula minnu pikkaTilaM~gaM~
aa. dagili sakhulu golvaM~ dallulu baaMdhava
satulu dODa raaM~ga savinayamuga
nagaru veDali naDache nagajaatakunu mrokka
baala chikurapihitaphaala yaguchu.
          సన్నద్ధులు = పోరుటకు సిద్ధపడినవారు; = అయ్యి; బహు = అనేకమైన; శస్త్ర = శస్త్రములుతో; సమేతులు = కూడినవారు; = అయ్యి; బలిసి = ఆవరించి; చుట్టును = నాలుగు వైపులా; వీర = శూరులైన; భటులు = సైనికులు; కొలువన్ = సేవించుచుండగా; ముందఱన్ = ముందు వైపు; ఉపాహారములు = నైవేద్య వస్తువులను; కానుకలు = మొక్కులు; కొంచున్ = తీసుకొని; వర్గంబులు = గుంపులుగ; = కూడి; వారవనితలు = వేశ్యాస్త్రీలు; ఏగన్ = పోవుచుండగా; పుష్ప = పూలు; గంధ = గంధము పూతలు; అంబర = వస్త్రములు; భూషణ = ఆభరణములు; కలితలు = కలిగినవారు; = అయ్యి; పాడుచున్ = పాటలు పాడుతు; భూసుర = విప్రుల; భార్యలు = ఇల్లాళ్ళు; అరుగన్ = పోతుండగా; పణవ = తప్పెట్లు, ఉడుకలు; మర్దళ = మద్దెలలు; శంఖ = శంఖములు; పటహ = ఢంకాలు; కాహళ = తుతారలు, బాకాలు; వేణు = పిల్లనగ్రోవులు; భేరీ = పెద్దనగారాలు యొక్క; ధ్వనులన్ = శబ్దములవలన; మిన్ను = ఆకాశము; పిక్కటిలగన్ = నిండిపోగా; తగిలి = కూడా.
          సఖులున్ = పరిచారికలు; కొల్వన్ = సేవించుచుండగా; తల్లులున్ = తల్లులు; బాంధవ = బంధువుల; సతులు = స్త్రీలు; తోడన్ = కూడా; రాగ = కూడా వస్తుండగా; సవినయముగన్ = వినయపూర్వకముగా; నగరున్ = అంతఃపురమునుండి; వెడలి = బయలుదేరి; నడచెన్ = వెళ్ళను; నగజాత = పార్వతీదేవి {నగజాత - నగ (పర్వతుని) జాత (పుట్టినామె), పార్వతి}; కున్ = వద్దకు; బాల = యువతి; చికుర = ముంగురులచేత; పిహిత = కప్పబడిన; ఫాల = నుదురుకలామె; అగుచున్ = అగుచు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: