Sunday, November 23, 2014

రుక్మిణీకల్యాణం – అంకిలి జెప్పలేదు

30- ఉ.
అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో!
పంజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చె
             ఓ పద్మనాభ! కృష్ణ! మహాత్మ! అడ్డుచెప్పడానికి లేదు. నీ పరాక్రమం చూపి, ఎల్లుండి నీవు చతురంగ బలాలతో సహా వచ్చి, శిశుపాలుడు జరాసంధులను జయించి, నా దగ్గరకు వచ్చి, నన్ను రుక్మిణిని రాక్షస వివాహమున తీసుకుకొని వెళ్ళవయ్య. నేను సంతోషంగా నీతో వచ్చేస్తాను.
30- u.
aMkili jeppalEdu; chaturaMgabalaMbulatODa nelli yO!
paMkajanaabha! neevu shishupaala jaraasutulan jayiMchi naa
vaMkaku vachchi raakShasavivaahamunan bhavadeeya shauryamE
yuMkuva chEsi kRiShNa! puruShOttama! chEkonipommu vachchedan.
          అంకిలి = అడ్డు; చెప్పన్ = చెప్పుటకు; లేదు = లేదు; చతురంగబలంబుల్ = చతురంగ సైన్యము {చతురంగబలము - 1రథములు 2ఏనుగులు 3గుర్రములు 4పదాతిదళము అనెడి నాలుగు అంగములు (విభాగములు) కల సేన}; తోడన్ = తోటి; ఎల్లి = రేపు; = ఓయీ; పంకజనాభ = కృష్ణా {పంకజనాభుడు - పద్మము నాభి యందుగలవాడు, విష్ణువు}; నీవు = నీవు; శిశుపాల = శిశుపాలుడు; జరాసుతులన్ = జరాసంధుడులను; జయించి = గెలిచి; నా = నా; వంక = వైపు, సహాయపడుట; కున్ = కు; వచ్చి = వచ్చి; రాక్షస = రాక్షసము పద్ధతి; వివాహమునన్ = వివాహము నందు; భవదీయ = నీ యొక్క; శౌర్యమున్ = పరాక్రమమును; ఉంకువ = ఓలిగా {ఉంకువ - అల్లుడు కన్యకార్థముగా మామ కిచ్చెడి ద్రవ్యము, శుల్కము}; చేసి = చేసి; కృష్ణ = కృష్ణ; పురుష = పురుషులలో; ఉత్తమ = శ్రేష్ఠుడా; చేకొనిపొమ్ము = తీసుకువెళ్ళుము; వచ్చెదన్ = నేను వస్తాను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: