Saturday, November 15, 2014

రుక్మిణీకల్యాణం – అయ్యా! కొడుకు విచారము

21- క.
య్యా! కొడుకు విచారము
య్యయు వారింపఁ జాలఁ టు గాకుండన్
నెయ్య మెఱిఁగించి చీరుము
య్యన నిజసేవకానుసారిన్ శౌరిన్.
          తండ్రీ! కొడుకుమాట మా నాన్న కూడ కాదనలేడు. అలా కాకూడదు. కనుక, నాప్రేమ తెలియజేసి భక్తుల వెంట నుండు వాడు, శూరుని మనుమడు అయిన శ్రీకృష్ణుణ్ణి వెంటనే రమ్మని పిలు.
21- ka.
ayyaa! koDuku vichaaramu
layyayu vaariMpaM~ jaalaM~ DaTu gaakuMDan
neyya meRriM~giMchi cheerumu
chayyana nijasEvakaanusaarin shaurin.”
          అయ్యా = నాయనా; కొడుకు = పుత్రుని యొక్క; విచారముల్ = ఆలోచనలను; అయ్యయున్ = తండ్రికూడ; వారింపన్ = నిలువరింప; చాలడు = నేరడు; అటు = ఆ విధముగ; కాకుండన్ = జరుగనీయకుండుటకు; నెయ్యమున్ = నా స్నేహమును, నా ప్రేమ; ఎఱిగించి = తెలిపి; చీరుము = పిలువుము; చయ్యనన్ = శీఘ్రముగా; నిజ = తన యొక్క; సేవక = భక్తులును; అనుసారిన్ = అనుసరించు వానిని; శౌరిన్ = కృష్ణుని.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: